Srinivas Goud( IMAGE Credit: swetcha reporter) N
తెలంగాణ

BC reservation bill: బీసీ రిజర్వేషన్ ను 9వ షెడ్యూల్ లో చేర్చాలి.. మాజీ మంత్రి డిమాండ్

BC reservation bill: బీసీలకు 42% రిజర్వేషన్‌ను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చితేనే తప్ప బీసీలకు న్యాయం జరగదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) స్పష్టం చేశారు. మాజీ సుప్రీంకోర్టు జడ్జి, నేషనల్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యను బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరం (బీసీపీఎఫ్) సభ్యులు కలిసి అభినందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దేశంలో బీసీలకు చట్టబద్ధతలతోనే న్యాయం జరుగుతుందన్నారు. గతంలో కూడా రాష్ట్రంలో జీవో జారీ చేస్తే హైకోర్టు కొట్టేయడం, సుప్రీంకోర్టులో కూడా తిరస్కరించబడటం జరిగిందని గుర్తు చేశారు.

 Also Read: Congress leaders: ఆ జిల్లాల్లో ఎక్కువ కొట్లాటలు కార్యకర్తలు లీడర్లలో సమన్వయం కొరవ

15న బీసీ మహా ధర్నా

మహారాష్ట్రలో కూడా ఇదే విధంగా జరిగిందని, అనేక రాష్ట్రాల్లో జీవోల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లు చెల్లవని కోర్టులు తీర్పునిచ్చాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జీవో ఇచ్చి ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కల్పిస్తామని చెబుతున్నారని, ఇది మోసపూరితమని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఈ నెల 15న ఇందిరాపార్క్ వద్ద జరగబోయే బీసీ మహా ధర్నాకు జస్టిస్ ఈశ్వరయ్యను బీసీపీఎఫ్ సభ్యులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీసీపీఎఫ్ సభ్యులు కుమార్ గౌడ్, ప్రనీల్ చందర్, సుర్వి యాదయ్య, దేవి రవీందర్, సుప్ప ప్రకాశ్, వల్లూరు వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.

 Also Read: MLC Kavitha: తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ కౌంటర్లు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు