Congress leaders: ఉమ్మడి వరంగల్ జిల్లాలలోనే కాంగ్రెస్ పార్టీలో సమస్యలు అత్యధికంగా ఉన్నాయని, కార్యకర్తలు, నాయకుల మధ్య సమన్వయం కొరవడిందని (Gandhi Bhavan) గాంధీ భవన్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో తేలింది. దీనివల్ల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగుతుందని, పార్టీ, ప్రభుత్వం ఆదేశాల మేరకు అందరూ సమిష్టిగా పనిచేయాల్సిందేనని కాంగ్రెస్ (Congress) నాయకత్వం స్పష్టం చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా (Warangal District) పార్టీ ఇన్‌చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) నేతృత్వంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క (Seethakka) ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక సమావేశం జరిగింది.
Also Read: Swetcha: ఆకర్షణీయమైన ఆఫర్లతో ఆన్ లైన్ బెట్టింగ్ వలలో చిక్కుకుంటున్న యువత
భర్తీపై చర్చ
పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించాల్సిన విధానం, వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో ఎక్కువ సీట్లు గెలిచేలా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పని చేయాలన్నారు. పార్టీ కోసం అందరూ ముందుకు సాగాల్సి ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సంస్థాగతంగా పార్టీ బలోపేతం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, పార్టీ సమస్యలపై వరంగల్ జిల్లా నేతల అభిప్రాయాలను తెలుసుకున్నామని, రాబోయే రోజుల్లో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించామని ఆమె వెల్లడించారు.
Also Read: B SarojaDevi: కోట మరణ వార్త మరువక ముందే మరో సీనియర్ నటి కన్నుమూత