YSRCP: ‘బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ’ అనే కార్యక్రమాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి వైసీపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఈ వినూత్న కార్యక్రమం ప్రారంభమైంది. ఆదివారం నాడు పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు మున్సిపాలిటీ, పుంగనూరు, చౌడేపల్లె, సోమల మండలాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదన్నారు. ‘చంద్రబాబు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ మాత్రమే కాకుండా 143 హామీలు ఇచ్చారు. ప్రతీ ఇంటికి ఇంతిస్తాం.. అంతిస్తాం అని టీడీపీ ప్రచారం చేసింది. వాటితో పాటుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలు పెట్టి బాండ్లు కూడా ఇచ్చారు. మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన మోసాలు ప్రతీ గ్రామానికి తీసుకుని వెళ్ళాలి. వైసీపీ హయాంలో వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారు. కరోనా సమయంలో కూడా ఎక్కడా వైఎస్ జగన్ వెనకడుగు వేయలేదు. కానీ, కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే చెడ్డ పేరు తెచ్చుకుంది. మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుది’ అని పెద్దిరెడ్డి విమర్శలు గుప్పించారు.
Read Also- Janasena: వినుత కోటా కోసం రంగంలోకి బడా లీడర్.. చెన్నై పోలీసులపై ఒత్తిడి!
అన్నీ వివరంగా చెప్పండి..!
‘ గతంలో రామారావును వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు మద్యపాన నిషేధాన్ని ఎత్తేశారు. కరెంట్ ఛార్జీలు పెంచమని రామారావు హామీ ఇస్తే ఆ మాటను కూడా తుంగలో తొక్కి ఐదుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. 2014లో కూడా అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇచ్చిన హామీలు పక్కన పెడుతున్నారు. తల్లికి వందనానికి రూ.13వేల కోట్లు అవసరమైతే కేవలం 8వేల కోట్లు మాత్రమే నిధులు కేటాయించారు. ఇక ఉచిత బస్సు అని చెప్పి అది స్థానికంగా మాత్రమే అని మెలికలు పెట్టారు.. అది కూడా ఇంకా అమలు కాలేదు. ఇవన్నీ కూడా మీరు ప్రజలకు గ్రామ గ్రామానా వివరించాలి’ అని పార్టీ శ్రేణులకు పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. మరోవైపు.. ఆదివారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమశంకర్ గణేష్ అధ్యక్షతన జరగ్గా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ విప్ కరణం ధర్మశ్రీ, శోభా హైమావతి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ముఖ్య నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన మోసాలు ప్రతీ గ్రామానికి, ప్రతి ఇంటికి తీసుకుని వెళ్ళాలని అమర్నాథ్ పిలుపునిచ్చారు.
Read Also- Viral News: 4 బకెట్ల పాలతో వ్యక్తి స్నానం.. అంత ఆనందం ఎందుకంటే?
పాణ్యంలోనూ..!
పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అధ్యక్షతన ‘బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం క్యూఆర్ కోడ్‌ను పార్టీ నేతలు ఆవిష్కరించారు. సమావేశంలో వైసీపీ యువ నాయకులు కాటసాని శివ నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, కార్పొరేటర్లు నారాయణ రెడ్డి, అరుణ, దండు లక్ష్మి కాంత్ రెడ్డి, మిద్దె చిట్టెమ్మ, పెద్దపాడు శ్రీధర్ రెడ్డి, బస్తిపాడు రమణారెడ్డి, కేశవరెడ్డి, అక్కినేని హనుమంత రెడ్డి, భూపాల్ రెడ్డి సత్యం రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, మద్దిలేటి, వేణుగోపాల్ రెడ్డి, శివశంకర్ రెడ్డి , చాంద్ బాషా, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
Read Also- AP Cabinet: డేంజర్ జోన్‌లో నలుగురు ఏపీ మంత్రులు.. వేటుకు రంగం సిద్ధం!