Kotaa Vinutha Case
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Janasena: వినుత కోటా కోసం రంగంలోకి బడా లీడర్.. చెన్నై పోలీసులపై ఒత్తిడి!

Janasena: శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జ్ వినుత కోటా, భర్త చంద్రబాబుల డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడి హత్య కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భార్య భర్తలిద్దరితో పాటు మరో ముగ్గురు చెన్నై పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే వినుత కోటాను ఈ కేసు నుంచి బయటపడేయడానికి.. మర్డర్ మరకలు తొలగించడానికి జనసేన భగీరథ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే.. ఈ కేసును చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయాలని అక్కడి పోలీసులకు రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువైనట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. వినుత కోసం జనసేనకు చెందిన ఓ బడా లీడర్ రంగంలోకి దిగినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు.. ‘కేసును ఆంధ్రాకు బదిలీ చేయాలంటే మీకేం కావాలి? ఎంత కావాలి?’ అని ఓపెన్ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తున్నది. ఇందుకు ఓ పోలీసు ఉన్నతాధికారి కూడా రివర్స్ ఎటాక్ చేసినట్లుగా తెలిసింది. ‘ మీకెందుకు అంత ఇంట్రెస్ట్? ఎందుకు అనవసర విషయాల్లో తలదూరుస్తున్నారు? తప్పు చేయకపోతే మేం అసలు టచ్ చేసేవాళ్లమా? అలా జరిగివుంటే లీడర్లు మమ్మల్ని వదులుతారా? అని సదరు బడా లీడర్‌కు ఉన్నతాధికారి గట్టిగా ఇచ్చిపడేశారని తెలిసింది.

Read Also- Vinutha Kotaa: వినుత కోటా డ్రైవర్ కేసులో నమ్మలేని నిజాలు.. అంతా ఆ వీడియో వల్లనే!

నీరుగార్చడానికేనా?
ముఖ్యంగా.. రాయుడు హత్య జరిగింది శ్రీకాళహస్తిలోనే ఉండొచ్చని, హత్య జరిగిన ప్రదేశం ఇక్కడే కాబట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపించే బాధ్యత తమదేనని ఆ జనసేన లీడర్ పదే పదే పోలీసులకు ఫోన్లు చేసి విసిగిస్తున్నట్లుగా తెలుస్తున్నది. అంటే.. ఈ కేసు ఆంధ్రప్రదేశ్‌కు వస్తే తప్పకుండా నీరుగారినట్లేనని జోరుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి తమిళనాడులోని డీఎంకే సర్కార్‌పై ఇప్పటికే పలుమార్లు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేయడం, హిందీ విషయంలో విమర్శించడం.. ఈ మధ్య అక్కడ జరిగే హిందూ కార్యక్రమాలకు.. బీజేపీ ప్రచారాలకు గట్టిగానే వెళ్తున్నారు. ఈ మధ్యనే వెళ్లొచ్చారు కూడా. ఆ ప్రభుత్వాన్ని, సీఎంను విమర్శించిన పరిస్థితుల్లో బహుశా జనసేన బడా లీడర్ ఒత్తిడి తెస్తున్న విషయం నిజమే అయితే మాత్రం దీన్ని అక్కడి ప్రభుత్వం తప్పకుండా సీరియస్‌గా తీసుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే డీఎంకే ప్రభుత్వానికి ఇదొక సువర్ణావకాశమనే చెప్పుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడిదే సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ బడా లీడర్ ఎవరో.. ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో పైనున్న పెరుమాళ్లకే ఎరుక.

Srinivas Sister

న్యాయం కావాలి!
చెన్నై నుంచి శ్రీకాళహస్తికి డ్రైవర్ శ్రీనివాస్ భౌతిక కాయం చేరుకున్నది. ‘అన్నయ్యా.. నన్ను ఒంటిరిని చేసి వెళ్లిపోయావా?’ అంటూ మృతదేహం వద్ద శ్రీనివాస్ సోదరి బోరున విలపించింది. కోటా వినుత భర్త చంద్రబాబుపై రాయుడు కుటుంబసభ్యులు, బంధువులు మండిపడుతున్నారు. ‘ మా అన్నయ్యని చంపింది కోటా వినూత దంపతులే. మా అందరిని కూడా చంపుతామని బెదిరించారు. మా అన్నయ్యని వాళ్ల దగ్గర పెట్టుకుని వాళ్ళే చంపేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాకు న్యాయం చేయాలి. జనసేన వల్ల మాకు న్యాయం జరగకపోతే మేం మరో పార్టీకి వెళ్లి పోరాటం చేస్తాం. వినుత దంపతులు, మా అన్నయ్యను హత్య చేసిన వాళ్ళను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. పోలీస్ స్టేషన్‌ నుంచి వదిలితే ఊరుకునేది లేదు’ అని వినుత దంపతులపై డ్రైవర్ శ్రీనివాస్ చెల్లెలు సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు ఎంటరై చిత్ర విచిత్రాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తు్న్నారు. ‘ సుగాలి ప్రీతీకి న్యాయం చేయని వ్యక్తి.. మీకు న్యాయం చేస్తాడని ఎలా అనుకుంటున్నారు?’ అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. ఈ మధ్య జరిగిన వరుస ఘటనలు జానీ మాస్టర్, కిరణ్ రాయల్, థర్టీ ఇయర్స్ పృథ్వీ, కోటా వినుతలను ఉదాహరణగా చూపిస్తూ దేశంలో ఎక్కడా లేని సరుకు అంతా జనసేనలోనే ఉందంటూ వైసీపీ కార్యకర్తలు సెటైర్లు పేలుస్తున్నారు.

Read Also- Viral News: 4 బకెట్ల పాలతో వ్యక్తి స్నానం.. అంత ఆనందం ఎందుకంటే?

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?