Viral News: భార్యతో విడాకులు.. 4 బకెట్ల పాలతో వ్యక్తి స్నానం
Assam Man Divorce
Viral News, లేటెస్ట్ న్యూస్

Viral News: 4 బకెట్ల పాలతో వ్యక్తి స్నానం.. అంత ఆనందం ఎందుకంటే?

Viral News: స్వభిమానాన్ని కించపరిచిన సంబంధం కొనసాగించాలని దాదాపు ఎవరూ కోరుకోరు. కలిసి ఉండి కలహాలతో కాపురం చేయడం కంటే ముగింపు పలకడమే మేలు అని భావిస్తుంటారు. వివాహేతర సంబంధం పెట్టుకొని పదేపదే ప్రియుడితో పారిపోతున్న తన భార్యతో తెగదెంపులు చేసుకోవాలని ఓ భర్త నిర్ణయించుకున్నాడు. ఇన్నాళ్లూ ఓపికతో ఉన్న అతడు, చివరాఖరకు చట్ట ప్రకారం విడాకులు ఖరారు కావడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. డైవర్స్ మంజూరయ్యాయంటూ లాయర్ చెప్పిన వెంటనే ఎగిరి గంతేశాడు.

Read Also- Tinmar Mallanna: జాగృతి కార్యకర్తల దాడిపై తీన్మార్ మల్లన్న ఫస్ట్ రియాక్షన్

4 బకెట్ల పాలతో స్నానం
అసోంలోని నల్బారి జిల్లాకు చెందిన మానిక్ అలీ అనే వ్యక్తి భార్యతో విడాకులు ఖరారు కావడంతో పండగలా సెలబ్రేట్ చేసుకున్నాడు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛ ఇప్పుడు దొరికిందని ఉబ్బితబ్బిబయ్యాడు. అయితే, ఈ వేడుకను మామూలుగా కాకుండా చాలా ప్రత్యేకంగా జరుపుకున్నాడు. ఏకంగా నాలుగు బకెట్ల పాలతో స్నానం చేశాడు. తన భార్యతో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న తర్వాత ఈ విధంగా తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలీ తన ఇంటి బయట ప్లాస్టిక్ షీట్‌పై నిలబడి 4 బక్కెట్ల పాలతో స్నానం చేయడం వీడియోలో కనిపించింది. ఒక్కొక్క బకెట్ పాలను పైకి ఎత్తుకొని తనపై పోసుకుంటూ ఆనందాన్ని ఆస్వాదించాడు.

Read Also- Iran Israel: ఇరాన్‌ అధ్యక్షుడిపై ఇజ్రాయెల్ హత్యాయత్నం.. జస్ట్ మిస్

అలీ ఏం చెప్పాడంటే..
పాలతో స్నానం చేస్తూ అలీ కొన్ని మాటలు మాట్లాడాడు. ‘‘ఈ రోజే నేను స్వేచ్ఛ పొందాను!. ఆమె పదేపదే ప్రియుడితో పారిపోతుండేది. కుటుంబ పరువును కాపాడేందుకు ఇంతకాలం నేనేమీ మాట్లాడలేదు. నా లాయర్ నిన్న రాత్రి ఫోన్ చేసి విడాకులు ఖరారయ్యాయని చెప్పారు. అందుకే, ఈ రోజు పాలతో స్నానం చేసి నా ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను’’ అని మనిక్ అలీ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు హాస్యాస్పదంగా స్పందిస్తుండగా, మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, అలీ భార్య రెండు సార్లైనా ప్రియుడితో పారిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఇద్దరి మధ్య ఘర్షణల తర్వాత చివరికి విడిపోవాలని దంపతులు నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.

Read Also- Viral News: 3 నెలల్లోనే సిటీ వదిలి వెళ్లిన యువకుడు.. అతడు చెబుతున్న కారణాలివే

Just In

01

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు

Road Accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని నలుగురు మృతి..!