Tinmar Mallanna: ‘‘బీసీలకు ఏమొస్తే నీకెందుకు.. నువ్వేమన్న బీసీవా?.. కంచం పొత్తు ఉందా?.. మంచం పొత్తు ఉందా?’’ అంటూ ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పంగా మారాయి. మేడిపల్లిలో తీన్మార్ మల్లన్న నిర్వహిస్తున్న ‘క్యూ న్యూస్’ ఆఫీస్‌పై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేయడం, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు మల్లన్న గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరపడం, పలువురికి గాయాలైన ఉదంతంపై తీన్మార్ మల్లన్న స్పందించారు. దాడి ఘటన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
మంచం పొత్తు అంటే..
కవితపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీర్మార్ మల్లన్న వివరణ ఇచ్చారు. ‘‘కంచం పొత్తు అంటే కలిసి భోజనం చేయడం. మంచం పొత్తు అంటే కలిసి వియ్యం పొందడం. వాళ్ల భాషలో అర్థం వేరే ఉండొచ్చు’’ అని వివరణ ఇచ్చారు. ‘‘నన్ను చంపడానికే ఈ దాడి కుట్ర చేశారు. ఇదే వెలమలు మా ఆడబిడ్డలను నగ్నంగా బతుకమ్మ ఆడిపించారు. వీళ్లు మా పై దాడులు చేస్తున్నారు. మీకు ఆత్మగౌరవం ఉంటుంది, మాకు లేదా?. బీసీలతో కవితకు ఏం సంబంధం?. మీ కులానికి, మా కులానికి ఏం సంబంధం?. బీసీల రాజకీయ పార్టీ రాకుండా ఉండాలనే ఈ దాడులు చేస్తున్నారు’’ అని పేర్కొన్నారు.
Read Also- Vinutha Kotaa: వినుత కోటా డ్రైవర్ కేసులో నమ్మలేని నిజాలు.. అంతా ఆ వీడియో వల్లనే!
50 మంది దాడి చేశారు
మొత్తం 50 మంది జాగృతి కార్యకర్తలు వచ్చి దాడి చేశారని తీన్మార్ మల్లన్న తెలిపారు. ‘‘కవిత బంధువు సుజిత్ రావు మా గన్‌మెన్ గన్ను లాక్కున్నారు. మా గన్‌మెన్ ఆయుధం లాక్కొని దాడి చేసే ప్రయత్నం చేశారు. అనివార్య పరిస్థితుల్లో మా గన్‌మెన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు ఈ చిల్లర దాడులపై చర్యలు తీసుకోవాలి. మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాం. బీసీల కోసమే నా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. దాడి కేసులో కవితను నిందితురాలిగా చేర్చాలని ఫిర్యాదులో పేర్కొన్నాను. ఆఫీసులోకి రాగానే సీసీ కెమెరాలు డీవీఆర్‌ను ధ్వంసం చేశారు. నా సెక్యూరిటీ దగ్గర గన్ లాక్కొని నాపై కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. కత్తులు, రాడ్లతో 50 మంది గూండాలను కవిత నాపై దాడికి పంపింది’’ అని ఆయన పేర్కొన్నారు.
నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తెలంగాణలో తిరుగనివ్వబోమని తీన్మార్ మల్లన్న అన్నారు. ‘‘బీసీ ఉద్యమం ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతోంది. బీసీలు అంటే ఏంటో మీకు చూపిస్తాం. నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. బీసీ ఉద్యమంతో కవితకు సంబంధం లేదు. కంచం మంచం అనేది తెలంగాణలో వియ్యం అందుకునే సందర్భంలో వాడే ఊతపదం. మా మీద దాడి చేసి మళ్లీ ఫిర్యాదులు చేయడానికి సిగ్గుండాలి. దాడి ఘటనతో భయపడను. ఏ విధంగా ముందుకెళ్లాలో నాకు తెలుసు’’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, తీన్మార్ మల్లన్న కార్యాలయానికి మల్కాజిగిరి డీసీపీ పద్మాజ రెడ్డి చేరుకున్నారు. క్లూస్ టీమ్ కూడా అక్కడికి చేరుకుంది. కాల్పులకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తోంది. హైదరాబాద్‌లోని మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ ఆఫీసుపై ఆదివారం ఉదయం దాడి జరిగింది. జాగృతి కార్యకర్తలు, ఎమ్మెల్సీ కవిత అనుచరులు ఆఫీస్‌లోకి వెళ్లి ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. వారిని అడ్డుకునేందుకు మల్లన్న గన్‌మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ పరిణామంతో భీతావహ పరిస్థితి కనిపించింది. గాయాలైన పలువురిని హాస్పిటల్‌కు తరలించారు.
Read Also- Nandamuri Balakrishna: ‘బాలకృష్ణ కాండ్రించి ఉమ్మేశాడు’… కోట శ్రీనివాసరావు