Fan Covers 2100 KM In 23 Days On Bicycle To Meet CSK Legend MS Dhoni
స్పోర్ట్స్

MS Dhoni: మహీ కోసం డై హార్డ్‌ ఫ్యాన్‌ ఏం చేసాడంటే..! 

Fan Covers 2100 KM In 23 Days On Bicycle To Meet CSK Legend MS Dhoni: భారత క్రికెట్ జట్టు మాజీ రథసారధి మహేంద్రసింగ్‌ ధోనికి ఉన్న ఫాలోయింగ్‌ మాటల్లో వర్ణించలేనిది. నాలుగేళ్ల క్రితం 15 ఆగస్ట్ 2020 ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మహీ చూపు కోసం ఇప్పటికీ ఫ్యాన్స్ పోటెత్తుతున్న దృశ్యాలే అందుకు నిదర్శనం. ఎక్కడ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నా సరే.. ప్రత్యర్థి జట్టు ఏదైనా స్టేడియం పసుపురంగు మయం అయిపోయింది.

ఆఖరికి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా అతనికి ఫ్యాన్స్‌గా మారిపోతున్నారు. అలాంటిది అంతటి గొప్ప క్రికెటర్‌ని కలవాలనే కోరిక ఎవరికి ఉండదు చెప్పండి. అందుకే ఓ అభిమాని ప్రాణాలకు తెగించి ఎవరు చేయని సాహసం చేశాడు. ఏకంగా 23 రోజుల పాటు సైకిల్‌పై 2,100 కి.మీ. దూరం ప్రయాణించి చెన్నై చేరుకున్నాడు. రాత్రి వేళల్లో ఎన్నో అడవులను, ప్రమాదకర ప్రదేశాలను దాటుకుంటూ మహీ వీరాభిమాని బిహార్‌కు చెందిన గౌరవ్‌ అనే యువకుడు తన ప్రయాణాన్ని సాగించాడు. అతను ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నాడు. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని వార్తలొస్తున్న నేపథ్యంలో ఎలాగైనా అతనిని కలుసుకోవాలనుకున్నాడు. వెంటనే తన సైకిల్‌పై ప్రయాణం స్టార్ట్ చేశాడు. అలా మొదలైన అతని ప్రయాణం పలు రాష్ట్రాలను దాటుకుంటూ చెన్నై చేరుకోడానికి 23 రోజులు పట్టింది.

Also Read: అప్పుడు ఫైర్, ఇప్పుడు జట్టు కోసం కూల్‌..

చివరకు చెన్నైలోని చేపాక్ క్రికెట్‌ మైదానం సమీపంలో గుడారం వేసుకుని ధోనీతో భేటి కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గౌవర్‌ను విచారించి, అతడి కోరిక తెలుసుకొని అభినందించడంతో పాటు నచ్చచెప్పి పంపించారు. అయితే అతను మాత్రం దిగ్గజ క్రికెటర్‌ను కలిసే వరకు చెన్నైని విడిచిపెట్టనని తెలిపాడు.నేను ధోనీకి పెద్ద అభిమానిని. ధోనిని వ్యక్తిగతంగా కలుసుకుని అతని ఆటోగ్రాఫ్ తీసుకోవాలనేది నా కల అని వారికి తెలిపాడు. అందుకోసమే ఇక్కడివరకూ వచ్చానని స్పష్టం చేశాడు. ఆయన్ను ప్రత్యక్షంగా చూడకుండా నేను ఇక్కడి నుంచి వెళ్లనని గౌవర్‌ తేల్చి చెప్పేశాడు. తనని మహీ ఎప్పుడు కలుస్తాడో, ఎక్కడ కలుస్తాడో చూడాలి మరి.

 

View this post on Instagram

 

A post shared by Gᴀuʀᴀv ♡ (@epic_g7)

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు