MLC Kavitha( image credit: twitter)
Politics

MLC Kavitha: బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ జారీ చేయించాలి.. కవిత డిమాండ్​!

MLC Kavitha: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ది ప్రభుత్వానికి ఉంటే హైకోర్టులో కేవీయెట్ దాఖలు చేసి ఆర్డినెన్స్​ జారీ చేయాలని జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha)  డిమాండ్​ చేశారు. తమ ఉద్యమాలకు దిగి వచ్చి రాష్ట్ర శాసనసభ, మండలిలో బిల్లులను ప్రవేశ పెట్టారన్నారు. తెలంగాణ జాగృతి, (Telangana Jagruti) యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులతో కలిసి శుక్రవారం తన నివాసంలో మీడియాతో కవిత మాట్లాడారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్ తో తెలంగాణ జాగృతి , (Telangana Jagruti) రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

యూపీఎఫ్ తో కలిసి అన్ని కుల సంఘాలను కలుపుకొని రౌండ్​ టేబుల్ సమావేశాలు, ఐక్య ఉద్యమాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామన్నారు. వంద రోజుల్లోనే కామారెడ్డి డిక్లరేషన్​ ను అమల్లోకి తెస్తామన్న హామీని కాంగ్రెస్​ తుంగలో తొక్కిందని విమర్శించారు. అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లుల ఆమోదం కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకు రాలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగానే ఈనెల 17న రైల్​ రోకోకు పిలుపు ఇచ్చినట్టు చెప్పారు. తమ ఒత్తిడికి తలొగ్గే రాష్ట్ర కేబినెట్ బీసీలకు స్థానిక సంస్థల్లో 42శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. ఇది నూటికి నూరుపాళ్లు తెలంగాణ జాగృతి సాధించిన విజయమని చెప్పారు.

 Also ReadGHMC: పాత్రధారులపైనే చర్యలు.. సూత్రధారుల సంగతేంటి?

సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిసి ఆర్డినెన్స్ జారీ చేసి తన మర్యాదను నిలబెట్టుకోవాలన్నారు. వెంటనే ఆమోదం తెలిపేలా రాష్ట్ర బీజేపీ (BJP) నాయకులు కూడా గవర్నర్ పై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్​ తెస్తామన్న ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో తాము పిలుపు ఇచ్చిన రైల్ రోకోను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. గవర్నర్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపి ఆర్డినెన్స్​ జారీ చేయకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదన మాత్రమే చేశారన్నారు. విద్య, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

 రాజ్యాంగ భద్రత కల్పించాలి

రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలకు ఆమోదం వచ్చేలా బీజేపీ (BJP) నాయకులు కృషి చేయాలన్నారు. లేనిపక్షంలో కాంగ్రెస్ (Congress) ​ తోపాటు బీజేపీ (BJP) నేతలు కూడా ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతను కేంద్ర మంత్రి బండి సంజయ్​ తీసుకోవాలన్నారు. షెడ్యూల్​ 9లో బీసీ రిజర్వేషన్లను చేర్పించి రాజ్యాంగ పరమైన భద్రత కల్పించాలన్నారు. అప్పుడే ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకు రిజర్వేషన్లు (Reservations BC) అమలవుతాయని చెప్పారు.

బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్​ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందా అన్నదానిపై వారం రోజులు చూస్తామన్నారు. పలు రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ న్యూట్రల్​ గా వ్యవహరించటం లేదని వ్యాఖ్యానిస్తూ ఆర్డినెన్స్​ కు రాష్ట్ర గవర్నర్​ ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నామన్నారు. ఆర్డినెన్స్​ ను ఎవరైనా వ్యతిరేకిస్తే వారి ఇళ్ల ముందు చావు డప్పు కొడతామని యూపీఎఫ్​ కన్వీనర్ బొల్లా శివశంకర్​ హెచ్చరించారు. సమావేశంలో జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్​ ఆచారి, నాయకులు రూప్​ సింగ్, వరలక్ష్మి, లలితా యాదవ్, సంపత్​ గౌడ్​, కొట్టాల యాదగిరి, నరేందర్​ యాదవ్, నరేశ్​ తదితరులు పాల్గొన్నారు.

అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు
మింట్ కాంపౌండ్ లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, ట్యాంక్ బండ్ పై గల డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసేందుకు వెళ్తోన్న తెలంగాణ జాగృతి నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ర్యాలీ అనుమతి లేదని.. ట్యాంక్ బండ్ పైకి వెళ్లొద్దని ఆంక్షలు విధించారు. దీంతో పోలీసులతో జాగృతి నాయకులు వాగద్వానికి దిగారు. రిజర్వేషన్ల పెంపు బీసీల దశాబ్దాల ఆకాంక్ష అని.. రాష్ట్ర కేబినెట్ గతంలో చేసిన చట్టాన్ని సవరిస్తూ తీర్మానం చేసిన నేపథ్యంలో మహనీయులకు నివాళులర్పించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత నివాసం నుంచి ట్యాంక్ బండ్ కు ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్​ విగ్రహాలకు పూలమాలలు వేశారు.

 Also Read: Tridha Choudhury: ఆ బ్యూటీ ప్యాంటు వేసుకోవడం మర్చిపోయిందా.. నెటిజన్ల హాట్ కామెంట్స్ వైరల్ ?

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!