Damodar Raja Narasimha: కల్తీ కల్లు తాగి నిమ్స్, గాంధీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా తీశారు. నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి, నిమ్స్, గాంధీ డాక్టర్లు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. పేషెంట్ల కండీషన్‌ను డాక్టర్లు మంత్రికి వివరించారు. ప్రస్తుతం నిమ్స్‌లో 35 మంది, గాంధీలో 18 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు మంత్రికి తెలిపారు.
Also Read: GPO in Revenue Village: ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవో.. ఈ నెల 27వ తేదీన అర్హత పరీక్ష
నిమ్స్‌లో ఉన్న 35 మందిలో ఐదుగురిని డిశ్చార్జ్ చేస్తున్నామని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప వెల్లడించారు. మిగిలిన 30 మందికి చికిత్స కొనసాగిస్తున్నామని వివరించారు. గాంధీలో ఉన్న 18 మందిలో నలుగురు డయాలసిస్‌పై ఉన్నారని డాక్టర్లు తెలిపారు. మిగిలిన14 మంది పేషెంట్ల కండీషన్ స్టేబుల్‌గా ఉందని వివరించారు. పేషెంట్లందరికీ మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు, డాక్టర్లకు మంత్రి సూచించారు. పూర్తిగా కోలుకునే వరకూ హాస్పిటల్స్‌లోనే ఉంచాలని, ఆ తర్వాతే డిశ్చార్జ్ చేయాలని ఆదేశించారు.