CM Revanth Reddy: అమెరికా, తెలంగాణ బంధాన్ని మరింత పటిష్టం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. స్నేహపూరితంగా ముందుకు సాగుతామన్నారు. రైజింగ్ తెలంగాణ (Rising Telangana) నినాదానికి అమెరికా మద్ధతు అవసరం అని వెల్లడించారు. ఆయన (Hyderabad) హైదరాబాద్ కాన్సూల్ జనరల్ అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడుతూ, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయిందన్నారు.
Also Read: KPHB Toddy Adulteration: కల్తీ కల్లు ఘటనపై ప్రభుత్వం సీరియస్
ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా, నిరంతరం ఆవిష్కరణలను అందించడమనే రెండు అంశాల్లో అమెరికా ప్రపంచ దృక్కోణాన్ని మార్చిందన్నారు. ఓటమిని ఎప్పుడూ అంగీకరించని స్ఫూర్తి అమెరికాదని కొనియాడారు. ఎల్లప్పుడూ బలమైన దేశంగా, అనేక అంశాల్లో ఒక సానుకూల మార్గంలో పరిష్కారాలను చూపగలిగిందన్నారు. తెలంగాణ స్ఫూర్తి కూడా అమెరికా( America) స్ఫూర్తికి ఎంతో సారూప్యత ఉన్నదన్నారు. స్నేహాన్ని కోరుకోవడం, బంధాన్ని మరింత పటిష్టపరుచుకోవడం తెలంగాణ ప్రత్యేకత అని వివరించారు. 2008లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి (YS Rajasekhara Reddy) నేతృత్వంలోని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో (Hyderabad) హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఏర్పాటైందని గుర్తు చేశారు. భారతదేశంతో దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో అమెరికా ఎంతో నిబద్ధతను ప్రదర్శించిందన్నారు. అమెరికాతో తెలుగు ప్రజలకు ఉన్న స్నేహపూర్వకమైన బంధం ఎంతో బలమైందన్నారు.
ఇరు దేశాల మధ్య బలమైన వారధిగా
అమెరికాలో ( America) తెలుగు భాష వేగంగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. హైదరాబాద్ కాన్సూల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ రెండు సంస్కృతుల మధ్య, ప్రజల మధ్య వాణిజ్యపరమైన సంబంధాలను పటిష్టపరచడంలో ఇరు దేశాల మధ్య బలమైన వారధిగా నిలుస్తున్నారన్నారు. ఐటీ, ఫార్మా, డిఫెన్స్, మాన్యుఫాక్చరింగ్, ఏరోస్పేస్ వంటి రంగాలకు చెందిన దాదాపు 200 అమెరికా కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా ప్రస్తుతం పనిచేస్తున్నాయన్నారు. ఎంతో మంది విద్యార్థులు తమ కలలను నెరవేర్చుకోవడానికి ఇక్కడి నుంచి అమెరికా వెళ్తున్నారన్నారు. జాతీయ స్థాయిలో పరస్పర విశ్వాసం, విలువల ఆధారంగా అమెరికా – భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతున్నదన్నారు.
వ్యాపార, వాణిజ్య రంగాలు, పెట్టుబడులు, ప్రజాస్వామ్యాన్ని విస్తృతం చేయడం, ప్రపంచ శాంతిని నెలకొల్పడం వంటి లక్ష్యాలతో స్నేహపూర్వక బలమైన సంబంధాలు కలిగి ఉండాలని ఇరు దేశాలు కోరుకుంటున్నాయన్నారు. ముఖ్యంగా సైనిక విన్యాసాలు, అంతరిక్ష పరిశోధనలో సహకారం, సాంకేతిక రంగంలో పెట్టుబడులకు సంబంధించిన వాణిజ్యంలో ఇరు దేశాలు రికార్డు నెలకొల్పాయన్నారు. హైదరాబాద్‌లో మరింత పురోభివృద్ధి సాధించాలని, అమెరికాలోని అత్యుత్తమైన వాటిని తెలంగాణకు తీసుకొస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఒక్కటిగా ఉంటే మరింత పటిష్టంగా ఎదగగలమని తాను విశ్వసిస్తున్నట్లు ప్రత్యేక థీమ్‌ను వివరించారు.
Also Read: Mahesh Kumar Goud: కాంగ్రెస్ చేసిన పనికి కల్వకుంట్ల కవిత రంగులు