Loans for Women( image credit: twitter)
తెలంగాణ

Loans for Women: మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊరట

Loans for Women: రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు గుడ్​ న్యూస్​ అందించింది. రూ.344 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేసి వారి ఆర్థిక ప్రగతికి బాటలు వేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ సెర్ప్‌​కు నిధులు విడుదల చేసింది. ఇందులో రూ.300 కోట్లు గ్రామీణ మహిళా సంఘాలకు, రూ.44 కోట్లు పట్టణ మహిళా సంఘాలకు విడుదల చేసింది. వడ్డీలేని రుణాలు శనివారం నుంచి ఈ నెల 18 వరకు మహిళా సంఘాల ఖాతాల్లో జమ కానున్నాయి. మంత్రి సీతక్క ( Seethakka)  చొరవతో వడ్డీలేని రుణాలు మంజూరు కావడంపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

 Also Read: GPO in Revenue Village: ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీవో.. ఈ నెల 27వ తేదీన అర్హత ప‌రీక్ష

రూ.500 కోట్ల వడ్డీలేని రుణాలు 

రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కులను పంపిణీ చేయనున్నారు. అంతేకాదు, ప్రమాద బీమా, లోన్ బీమా చెక్కులను కూడా ప్రజాప్రతినిధులు అందజేయనున్నారు. బీఆర్​ఎస్ (BRS) హయాంలో వడ్డీలేని రుణాలు నిలిచిపోయాయి. రూ.3000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. దీంతో మహిళా సంఘాల ఆర్థిక కార్యకలాపాలకు కొంత బ్రేక్​ పడింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే వడ్డీలేని రుణాల చెల్లిస్తున్నది. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్ల వడ్డీలేని రుణాలను మంజూరు చేసిన ప్రభుత్వం, రాబోయే రోజుల్లో రూ.లక్ష కోట్ల రుణాలను అందించే లక్ష్యంతో ముందుకెళ్తున్నది.

 Also Read: Kavitha: దెయ్యం ఎవరు.. మీరా మేమా? కవితపై గులాబీ నేతల గుస్సా!

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?