Ujjaini Mahankali(image creditL: twitter)
తెలంగాణ

Ujjaini Mahankali: అమ్మవారికి బోనం సమర్పించిన గవర్నర్ దంపతులు

Ujjaini Mahankali : ఆషాడ మాసం బోనాల జాతరను పురస్కరించుకుని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని  గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Jishnu Dev Varma) సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సాంప్రదాయ రీతిలో గవర్నర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మహంకాళి అమ్మవారికి గవర్నర్ సతీ సమేతంగా బోనాలతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) మాట్లాడుతూ, వచ్చిన భక్తులందరికీ అమ్మవారి దర్శనం కల్పించాలని, 13న బోనాలు, 14న రంగం ఉన్నందున భక్తులు లక్షల్లో వచ్చే అవకాశాలు ఉన్నదని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారని, ప్రభుత్వం భక్తుల రద్దీ దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు మంత్రి పొన్నం వెల్లడించారు.

 Also Read: KTR vs Kavitha: కేటీఆర్ వర్సెస్ కవిత.. పార్టీ ఒకటే.. దారులు మాత్రం వేరే

రేపు ఉజ్జయిని మహంకాళి బోనాలు
13వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి (Ujjaini Mahankali )అమ్మవారి బోనాలు, 20న లాల్ దర్వాజా బోనాలు ఉత్సవాలు జరుగనున్నట్లు తెలిపారు. బోనాల జాతరను పురస్కరించుకుని జంట నగరాల్లో 3 వేలకు పైగా దేవాలయాల్లో బోనాల ఉత్సవాల పూజలు జరుగుతున్నట్లు మంత్రి పొన్నం పేర్కొన్నారు. బోనాల ఉత్సవాల్లో ఇబ్బందులు లేకుండా నగరంలో పోలీస్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసిందని, అన్ని దేవాలయాలకు ఖర్చు కోసం ఇప్పటికే చెక్కులు పంపిణీ చేశామన్నారు. బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరుపున మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, పోలీసులు ఎక్కడ ఇబ్బందులు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.

రక్షణ చర్యలు చేపట్టాలి
సికింద్రాబాద్ అమ్మవారి ఊరేగింపు రోజు రోప్ ఏర్పాటు చేసి ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. నల్ల పోచమ్మ దేవాలయం వద్దకు బోనాలు తీసుకెళ్లే మహిళా భక్తులకు చైన్ స్నాచింగ్ జరగకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శానిటేషన్ కోసం అదనంగా బృందాలు ఏర్పాటు చేయాలని, భక్తుల సౌకర్యార్థం మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రత్యేక జనరేటర్ ఏర్పాటు చేసి, నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు.

 Also Read: Congress party ministers: త్వరలో మాడ్గుల నుంచి దేవరకొండ వరకు డబుల్ రోడ్డు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది