Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. అలాంటిది వరసగా రెండు చిత్రాలు విడుదల చేసి పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. ‘హరి హర వీరమల్లు’ జూలై 24న విడుదల కానుండగా… ‘ఓీ’ సెప్టెంబర్ 25న విడుదల కానుంది. రెండు వరుస సినిమాలు రావడంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుని.. చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాలు రావడంతో ఈ సారి బాక్సాఫీసు బద్దలవుతుందని అభిమానులు అంటున్నారు. 2023 వచ్చిన ‘బ్రో’ తర్వాత రెండు సంవత్సరాలు సినిమాలకు గ్యాప్ వచ్చింది. ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’ విడుదలకు సిద్ధంగా ఉండగా.. తాజాగా ‘ఓజీ’ సినిమా నుంచి కూడా అప్డేట్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ‘ఓజీ’ చిత్రీకరణ పూర్తయిందని నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రావడంతో ఆ సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పవన్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
Read Also-Medak Crime: కల్లు సీసాతో పొడిచి.. బండ రాయితో దారుణ హత్య
ఈ సందర్భంగా నిర్మాతలు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో పవన్ కళ్యాణ్ పోస్టర్ ను చూస్తుంటే.. అప్పట్లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపోందిన ‘పంజా’ సినిమా గుర్తుకు తెచ్చేలా ఉంది. పవన్ సీరియస్ లుక్‌తో వర్షంలో పిస్టోల్ పట్టుకుని కారులో నుంచే ఎవరికో గురిపెట్టినట్టు ఉంది పోస్టర్. దీనిని చూసిన అభిమానులు పవన ఇండస్ట్రీ రికార్డులకు గురిపెట్టాడంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అంటే ఈ దెబ్బతో పవన్ మరోసారి బాక్సాఫీసు దగ్గర తన మేనియా చూపించబోతున్నారని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. పోస్టర్ లో పవర్ స్టార్ కమిట్మెంట్ చూసిన అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. దీనికి తోడు ‘సాహో’ వంటి భారీ చిత్రానికి దర్శకత్వం వహించిన సుజిత్ మరోసారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read Also- Rajinikanth: ‘కూలీ’ Vs ‘వార్ 2’… అదే అయితే హిట్ వారిదే!
ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అసలే యాక్షన్ మూవీ అందులో థమన్ సంగీతం అందించడంతో ధియేటర్లు బద్దలు కానున్నాయని ప్రేక్షకులు అంటున్నారు. రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫర్లుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుల్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి తదితర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ తారాగణం, నాణ్యమైన నిర్మాణ విలువలు ఉండటంతో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ ఖాయమంటూ సినీ పెద్దలు కితాబిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.