coolie vs war 2( image source :x)
ఎంటర్‌టైన్మెంట్

War 2 vs Coolie: ‘కూలీ’ Vs ‘వార్ 2’… అదే అయితే హిట్ వారిదే!

War 2 vs Coolie: భారత దేశ సినీ ఇండస్ట్రీలో సునామీ రాబోతుందా..? అంటే అలాంటిదే అని చెప్పాలి. ఎందుకంటే రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయి. ఒకటి హ్రుతిక్ రోషన్ నటించిన ‘వార్ 2’ అయితే మరొకటి సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajinikanth)నటించిన ‘కూలీ’. ఈ రెండు సినిమాలు అగస్టు 14న విడుదల కానుండటంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ‘కూలీ’ చిత్రానికి వరస హిట్‌లతో దూసుకుపోతున్న లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుద్ సంగీతం సమకూరుస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జున, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, ఉపేంద్రలు ‘కూలీ’ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ‘వార్ 2’ సినిమాకు ‘బ్రహ్మాస్త్ర’ వంటి విజువల్ వండర్‌ను తెరకెక్కించిన అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హృతిక్‌ రోషన్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

Read Als0- Kaleshwaram Water Flow: ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి

ప్రస్తుతం ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో ఏ సినిమా మెప్పిస్తుందో అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాల అభిమానుల మధ్య వార్ జరుగుతుంది. ఇదిలా ఉండగా ఐఎమ్‌డీబీ ప్రకారం 2025 రెండో అర్ధ భాగంలో ఏ సినిమా కోసం ప్రేక్షకులు అసక్తిగా ఎదురు చూస్తున్నారో అన్న విషయాన్ని IMDB బయట పెట్టింది. ఇందులో సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన ‘కూలీ’ సినిమా మొదటి స్థానంలో ఉంది. యంగ్ హీరోలను పక్కన పెట్టి 74 ఏళ్ల వయసులో రజనీ మొదటి స్థానంలో ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తర్వాత స్థానంలో ‘వార్ 2’ ఉంది. దీనిని బట్టి చూసుకుంటే ‘కూలీ’ సినిమా ఈ రేసులో విజయం సాధించిందని అభిమానులు సంబరపడుతున్నారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా ‘కూలీ’ సినిమాలో భాగం కావడంతో నార్త్‌లో కూడా మంచి విజయం సాధిస్తుందని రజనీ అభిమానులు ఆసిస్తున్నారు. ఇదిలా ఉండగా ‘వార్ 2’ సినిమా ప్రపంచవ్యాప్తంగా 7500 స్క్రీన్‌లలో విడుదలవుతుందని టాక్. అదే అయితే మాత్రం సినిమా భారీ ఓపినింగ్స్ రావడం ఖాయం.

Read Als0- Mahesh Babu: ఆ హీరోయిన్ ఎంగిలి చేసిన డ్రింక్ మహేష్ బాబు తాగాడా? ఫోటో వైరల్

ఇప్పటికే ‘వార్2’ సినిమా పూర్తయిందని సోషల్ మీడియాలో తారక్ పోస్ట్ చేశారు. యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే ఈ సినిమా మంచి కలెక్షన్స్ వసూలు చేసేలాగానే కనిపిస్తోంది. ఇందులో ఒక పాట కోసం దాదాపు 15 కోట్ల రూపాయాలను నిర్మాతలు ఖర్చు చేస్తున్నారని టాక్. ప్రచారంలో కూడా ‘వార్ 2’ దూసుకుపోతుంది. తమదైన స్టైల్లో ఆయా తారలు ఇప్పటికే ప్రచారాలు మొదలు పెట్టేశారు. ఇటు ‘కూలీ’ సినిమా తగ్గనంటుంది. ఇప్పటికే  థియేట్రికల్ రైట్ల్ 288 కోట్లకు అమ్మడు పోయాయి. హిందీ మినహా అన్ని భాషల్లోనూ థియేట్రికల్ అమ్ముడు పోయాయి. విడుదలకు ముందే ఈ సినమాకు ఇంత హైప్ ఉంటే ఫస్ట్ డే కలెక్షన్స్ ఆల్ టైం రికార్డులను దాటతాయని సినీ క్రిటిక్స్ అంటున్నారు.

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు