Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందరో హీరోలు ఉన్నప్పటికీ, సూపర్ స్టార్ మహేష్ బాబు స్థానం చాలా ప్రత్యేకమైనది. అతని అభిమానుల జాబితాలో యువకులతో పాటు యువతులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. దీనికి కారణం అతని మాట తీరు, హ్యాండ్సమ్ లుక్ అనే చెప్పుకోవాలి.
ఐదు పదుల వయసు దగ్గర పడుతున్నప్పటికీ, కుర్ర హీరోలతో సమానంగా పోటీపడుతూ, సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు మహేష్ బాబు. అతని తీసిన సినిమాలు దాదాపు అన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. అన్నీ సినిమాల కంటే పోకిరి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యెకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని వృత్తి జీవితంలో వివాదాలకు దూరంగా ఉంటాడు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కుటుంబంతో గడుపుతుంటాడు. ఇండస్ట్రీలో హీరోగా మంచి పేరు తెచ్చుకుని, నమ్రతను ప్రేమించి, వివాహం చేసుకున్నాడు. ఆదర్శ జీవనశైలితో అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
Also Read: Cow Calf: రెండు కాళ్లతో నడుస్తున్న ఆవు దూడ.. కోవిడ్‌ను మించిన ముప్పు రాబోతుందా.. దేనికి సంకేతం?
కూల్ డ్రింక్ వల్ల అంత పెద్ద గొడవ జరిగిందా?
అయితే, ఇంత ఇమేజ్ సొంతం చేసుకున్న మహేష్ బాబు కెరీర్‌లో ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజకుమారుడు సినిమా షూటింగ్ సమయంలో, దర్శకుడు కె. రాఘవేంద్రరావుతో మహేష్ బాబు చిన్న గొడవ జరిగిందంటూ వచ్చాయి. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ప్రీతి జింతా నటించింది. అయితే ఈ సంఘటన ఒక కూల్ డ్రింక్ చుట్టూ తిరిగింది.
Also Read: Tridha Choudhury: ఆ బ్యూటీ ప్యాంటు వేసుకోవడం మర్చిపోయిందా.. నెటిజన్ల హాట్ కామెంట్స్ వైరల్ ?
ఆ రోజు ఏం జరిగింది?
రాజకుమారుడు (1999) షూటింగ్ సమయంలో ప్రీతి జింతా ఒక కూల్ డ్రింక్ తాగుతోంది. ఆమె తాగిన సగం కూల్ డ్రింక్ బాటిల్‌ను దర్శకుడు కె. రాఘవేంద్రరావు మహేష్ బాబుకు ఇచ్చి తాగమని అన్నారట. దీంతో మహేష్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేశాడని అప్పట్లో ఒక మీడియా సంస్థ కూడా దీని గురించి రాసింది. “హీరోయిన్ ఎంగిలి చేసిన కూల్ డ్రింక్ నేను ఎలా తాగుతాను అని ఇస్తున్నారు? అంటూ మహేష్ బాబు ఆ క్షణంలో సెట్ నుంచి అలిగి వెళ్లిపోయాడని తెలిసిన సమాచారం.
Also Read: KTR Challenges CM Revanth: చర్చకు రాకుంటే ముక్కు నేలకు రాసి సారీ చెప్పాలి.. కేటీఆర్ సంచలన కామెంట్స్!
నెటిజన్ల రియాక్షన్ ఇదే..
ఈ వార్త పై నెటిజన్స్ రక రకాలుగా స్పందిస్తున్నారు. మహేష్ బాబు తగిన తర్వాత చెప్పి ఉంటారు.. ముందే చెప్తే తాగడు కదా అని కొందరు అంటున్నారు. ఇంకొందరు తాగే ఉంటాడు? అవన్నీ బయటకు చెప్తారా ఏంటి? అయిన ఆమె ఎంగిలి చేసిన డ్రింక్ నే మహేష్ బాబు ఎందుకు తాగాడని కామెంట్స్ చేస్తున్నారు.