42 percent bc reservation: బీసీ(BC) రిజర్వేషన్లను పక్కగా అమలు చేసేందుకు ప్రభుత్వం తన కసరత్తును మొదలు పెట్టింది. కేవలం వారం రోజుల్లో 42 శాతం రిజర్వేషన్ పై తమకు రిపోర్టు ఇవ్వాలంటూ డెడికేషన్ కమిషన్(Dedication Commission) కు సర్కార్ సూచించింది. త్వరలోనే 42 శాతం రిజర్వేషన్ జాబితా ప్రభుత్వానికి చేరనున్నది. అయితే రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం ఎలాంటి ఆర్డినెన్స్ ను తీసుకు రావడం లేదు. అసెంబ్లీ తీర్మానం తోనే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చి ముందుకు వెళ్లనున్నది. గతంలో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం కూడా రాష్ట్రపతి ఆమోదం లేకున్నా ప్రత్యేక జీవోతో ఎస్సీ రిజర్వేషన్ ను పెంచినట్లు కాంగ్రెస్(Congress) సర్కార్ చెప్తుంది. ఇప్పుడు కూడా తాము జీవోతో మాత్రమే 42 శాతాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టంగా వివరించింది. ఈ ప్రాసెస్ అంతా వారం రోజుల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్‌లను ఇంప్లిమెంట్ తప్పనిసరిగా చేసేందుకు ఎలాంటి చిక్కులు, సవాళ్లు లేకుండా అడ్వకేట్ జనరల్ నుంచి కూడా లీగల్ ఓపీనియన్ తీసుకున్నట్లు సెక్రటేరియట్ అధికారులు తెలిపారు. ఈ మేరకే ప్రాసెస్ స్పీడప్ అయింది.
2018 –2019చట్టం సవరణకు ఆర్డినెన్స్
42 శాతం రిజర్వేషన్లలో ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తతో 2018–2019 పంచాయితీ రాజ్ చట్టాన్ని ప్రభుత్వం సవరించనున్నది. బీసీ(BC) రిజర్వేషన్ పెంపునకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న పంచాయితీ రాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 285(ఏ)ను సవరించనున్నారు. గతంలో ఈ చట్టం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో(local body elections) 50 శాతం రిజర్వేషన్లు మంచికూడదని సీలింగ్ పెట్టారు. ఇప్పుడు దాన్ని తొలగిస్తూ సవరించనున్నారు. కానీ ఏ శాతం మేరకు రిజర్వేషన్లు ఇస్తారనేది చట్టంలో పొందుపరచడం లేదని ప్రభుత్వం చెప్తున్నది. దీని వలన ప్రభుత్వం తీసుకురాబోయే జీవో ద్వారా బీసీ రిజర్వేషన్ ను 42 శాతానికి పెంచినా..చట్ట పరంగా ఎలాంటి సమస్య ఉండదనేది ప్రభుత్వం చెప్తున్నది. గవర్నర్ కూడా దీనికి అభ్యంతరం చెప్పే పరిస్థితి ఉండదని ఉన్నతాధికారులు వివరించారు.
Also Read: Telangana: ఇండియా మ్యాప్‌లో తెలంగాణను మరిచారా.. అక్కర్లేదా?
పుల్ పబ్లిసిటీ
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను స్పష్టంగా అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయనున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ ను అమలు చేసి తన చిత్తశుద్దిని చాటనున్నది. దీని వలన పదేళ్ల పవర్ కు మార్గం మరింత సులువుగా మారుతుందనేది ప్రభుత్వం భావన. దీంతోనే బీసీ సంఘాలు, బీసీ నేతలు, గ్రౌండ్ లెవల్ లోని కుల సంఘాల నేతలతో పుల్ పబ్లిసిటీ చేయనున్నారు. ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి బీసీ బిల్లుపై భారీ స్థాయిలో ప్రచారం చేయనున్నారు. ఈమేరకు పీసీసీ చీఫ్ కూడా అన్ని జిల్లాల డీసీసీలకు ఆదేశాలిచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ వివరించనున్నది. దీంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే.. తెలంగాణ వచ్చాక కేసీఆర్ హయాంలో రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండగానే 22 శాతానికి బీసీ రిజర్వేషన్లు తగ్గించి నోటిఫికేషన్ ఇచ్చారనే విషయాన్నీ జనాలకు వివరించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నది.
Also Read: Congress vs BRS: ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య పోస్టర్ల యుద్ధం