Telangana Map Issue
తెలంగాణ

Telangana: ఇండియా మ్యాప్‌లో తెలంగాణను మరిచారా.. అక్కర్లేదా?

Telangana: తెలుగు రాష్ట్రాల మధ్య రెండ్రోజులకోసారి ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉన్నది. ఈ మధ్యనే నీటి పంపకాలు, బనకచర్ల గురించి ఏ రేంజిలో వివాదం నడుస్తున్నదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ వివాదాలు ఇంకా సద్దుమణగక మునుపే ఈసారి ఏకంగా ‘తెలంగాణ మ్యాప్’ వివాదం నెలకొన్నది. తెలుగు రాష్ట్రాల బీజేపీ కొత్త అధ్యక్షులను హైకమాండ్ నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కొత్త అధ్యక్షులు.. ముఖ్య నేతలను, క్యాడర్‌ను కలుస్తూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన మాధవ్‌కు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కంగ్రాట్స్ చెప్పారు. అంతేకాదు.. భారత సాంస్కృతిక వైభవం అంటూ లోకేష్‌కు ఇండియా మ్యాప్‌ను మాధవ్‌ బహుకరించారు. ఇదే పెద్ద వివాదానికి దారితీసింది. ఆ మ్యాప్‌లో తెలంగాణ లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలు, తెలంగాణ మేథావులు, కవులు, రచయితలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది తెలంగాణ అస్థిత్వంపై దాడి అని బీఆర్ఎస్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ అంశాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా మీడియా, సోషల్ మీడియా వేదికగా కారు పార్టీ నేతలు వెల్లడించారు. అంతేకాదు.. ఈ ప్రక్రియ రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానిస్తున్నారు.

Read Also- Janasena: వైసీపీ నుంచి జనసేనలో చేరిన కీలక నేత బహిష్కరణ

క్షమాపణ చెప్పాల్సిందే..!
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. మా సాంస్కృతిక గుర్తింపు, చరిత్రలో సరైన స్థానం, భౌగోళిక స్థితి.. తెలంగాణ కోసం మేము తరతరాలుగా పోరాడాం. ఈ రోజు, మీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, సమైక్య ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌ను బహుమతిగా ఇవ్వడం ద్వారా.. తెలంగాణ ఉనికిని విస్మరించడం ద్వారా మా పోరాటాన్ని తక్కువ చేసి చూపారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇది తెలంగాణ ప్రజల పట్ల, మా రాష్ట్రం పట్ల, మా పోరాటం పట్ల, అమరుల త్యాగాల పట్ల, చరిత్ర పట్ల స్పష్టమైన నిర్లక్ష్యాన్ని చూపిస్తోంది. మన చరిత్రను చెరిపేస్తే మనం ఏమవుతాం? సర్, ఇది మీ పార్టీ ప్రణాళికను లేదా రాజకీయ ఎజెండాను ప్రతిబింబిస్తుందో లేదో స్పష్టం చేయాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఇది నిజంగా పొరపాటు అయితే, మీ పార్టీ నాయకత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ అని కేటీఆర్ ట్వీట్‌లో డిమాండ్ చేశారు.

పాత రోజులు గుర్తు చేస్తూ..!
మరోవైపు బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ మాధవ్ భారతీయ సాంస్కృతిక వైభవం పేరిట నారా లోకేష్‌కు ఇచ్చిన చిత్రపటంలో తెలంగాణ మ్యాప్ లేకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ‘ చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారు. తెలంగాణ లేని చిత్రపటాన్ని బీజేపీ నేత ఇవ్వడం టీడీపీ నేత తీసుకోవడం నరనరాల్లో వారికి తెలంగాణ అంటే ఇష్టం లేని తీరును సూచిస్తోంది. తెలంగాణ లేని చిత్రపటం ఇవ్వడం అంటే.. తెలంగాణ అస్ధిత్వంపై దాడిగానే భావించాలి’ అని సీనియర్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇక బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే చిత్ర విచిత్రాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ అసలు తెలంగాణ పుట్టకనే ఇష్టం లేదు ఈ బీజేపీ వాళ్లకి. తల్లిని చంపి బిడ్డను బతికించినట్టుగా ఆంధ్రప్రదేశ్‌ను విభజించారని విభజన బిల్లు ఆమోదం పొందిన కేవలం 10 రోజులకే కర్ణాటకలోని గుల్బర్గాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో విషం కక్కారు నరేంద్ర మోదీ. బీజేపీ నాయకులకు తెలంగాణ రావడమే వందకు వెయ్యిశాతం ఇష్టం లేదు’ అని కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు.. మ్యాప్‌లో తెలంగాణను మరిచారా..? అస్సలు అక్కర్లేదా అని కూడా బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

Read Also- Nayanthara: భర్తతో విడాకులు.. మరోసారి సంచలన పోస్ట్ పెట్టిన నయనతార?

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?