BC Reservation (imagecredit:swetcha)
రంగారెడ్డి

BC Reservation: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో సంబురాలు

BC Reservation: బీసీలకు 42% రిజర్వేషన్ గొప్ప సాహసోపేత, చారిత్రాత్మక నిర్ణయం అని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్(MLA Veerlapalli Shankar) అన్నారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్ అమలుపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రంగారెడ్డి(Ranga Reddy) జిల్లా షాద్ నగర్ పట్టణంలో సంబరాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే విల్లపల్లి శంకర్ క్యాంపు కార్యాలయంలో బీసీ సేన తదితర కాంగ్రెస్ పార్టీ వివిధ అనుబంధ సంఘాల బీసీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వానిది ఫామ్ హౌస్ క్యాబినెట్ కాదని సెక్రటరీయేట్ కేబినెట్ అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ను ఉద్దేశించి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని అన్నారు. రాజకీయ చరిత్రలోనే సంచలనం రేకెత్తించే గొప్ప సాహసోపేతమైన 42 శాతం బీసీలకు రిజర్వేషన్ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నామని అన్నారు.

 రెండు శాతం ఉన్న వర్గాలు దేశాన్ని పాలించాయి

కామారెడ్డిలో బిసి డిక్లరేషన్(BC Declaration in Kamareddy) సందర్భంగా మాట ఇచ్చి నేడు నెరవేర్చబోతున్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంత క్లిష్టమైన సరే వాటిని అమలు చేసే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తన భుజస్కాంతాలపై వేసుకున్నారని ఎమ్మెల్యే అన్నారు. సామాజిక అసమానతలను నిర్మూలించేందుకు 42 శాతం బీసీల రిజర్వేషన్ ఒక శిలా శాసనమని అన్నారు. గతంలో రెండు శాతం ఉన్న వర్గాలు దేశాన్ని పాలించాయని 7 శాతం ఉన్న వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను, 0.5 శాతం ఉన్న వర్గాలు తెలంగాణను సుదీర్ఘ కాలం పాలించాయని ఇది రాజకీయ అసమానతలకు, అన్యాయాలకు నిదర్శనం అని అన్నారు. కుల గణనపై భారత్ జోడు యాత్ర సందర్భంగా అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇచ్చిన మాట ప్రకారం దేశానికే నేడు కులగనన ఆదర్శమైందని అన్నారు.

Also Read: MP Raghunandan rao: సీఎం రేవంత్ రెడ్డికి రఘునందన్ రావు బహిరంగ లేఖ

100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు వెళ్లిందట..!
100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు వెళ్లినట్టు జాగృతి నాయకురాలు కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత(MLC Kaviha) బిసిల రిజర్వేషన్ పై కాంగ్రెస్ పార్టీని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మద్యం కుంభకోణంలో చిక్కుకుని జైలు పాలైన వాళ్ళు కూడా నీతులు చెబుతున్నారని విమర్శించారు. బీసీలపై చిత్తశుద్ధితో కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ(Delhi)లో జంతర్మంతర్ వద్ద బీసీ కులగణన తదితర రిజర్వేషన్ అంశాలను పురస్కరించుకొని ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి బీసీలపై పూర్తి చిత్తశుద్ధి ఉందని అన్నారు. బీసీ బిడ్డల కోసం రాజ్యాధికారాన్ని తెచ్చేందుకు గతంలో బీసీ నేత ఆర్ కృష్ణయ్య తదితర బీసీ నాయకులతో కలిసి అనేక చర్చలు జరిగాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నియోజకవర్గంలో బీసీ సేన ఆధ్వర్యంలో మహిళలు తదితర సంఘాల నాయకులు పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు చేపడుతుండడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని, బీసీల ఐక్యత కోసం పోరాడిన బీసీ సేన సభ్యులకు ఆయన ప్రత్యేకంగా అభినందించారు. త్వరలో మహిళా రిజర్వేషన్లు కూడా ప్రకటించబోతున్నామని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), పొన్నం ప్రభాకర్(MIN Ponnam Prabakar), ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) తదితరులకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వానికి కృతజ్ఞతలు – బిసి సేన
బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించిన కాంగ్రెస్(Congress) ప్రభుత్వానికి కృతజ్ఞతలు అంటూ బీసీ సేన షాద్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ కత్తి చంద్రశేఖరప్ప కృతజ్ఞతలు తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు కూడా బిసి సేన తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నిక(Local Body Elections)ల్లో బీసీలు కాంగ్రెస్(Congress) పార్టీ రుణం తీర్చుకుంటారని అన్నారు. బీసీ సేన అసెంబ్లీ నాయకురాలు వరలక్ష్మి మాట్లాడుతూ గ్రామ గ్రామాన తిరుగుతూ బీసీ(BC)లను రాజకీయ చైతన్యవంతం చేస్తున్నామని ఇప్పుడు బీసీలకు రాజకీయంగా ఎంతో గొప్ప అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. పట్టణ అధ్యక్షురాలు కాటం భాగ్యలక్ష్మి గౌడ్ మాట్లాడుతూ గత కొంతకాలంగా నియోజకవర్గంలో బిసి సేన కార్యక్రమాలు జోనందుకున్నాయని అదేవిధంగా పట్టణంలో కూడా బీసీ మహిళలను ప్రజలను చైతన్యవంతం చేయడం ఇప్పుడు బీసీ ఫలాలు స్థానిక రిజర్వేషన్లలో అందుతుండడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.

Also Read: Uttam Kumar Reddy: గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలంగాణకు అన్యాయం!

ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్(MLA Veerllapally shankar) కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. మండల పార్టీ అధ్యక్షురాలు జలజ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులకు బిసి సేన తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ చంద్రశేఖర్, బిసి సేన నాయకులు అసెంబ్లీ ఇన్చార్జి కత్తి చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, అసెంబ్లీ ఇన్చార్జ్ వరలక్ష్మి, మండల అధ్యక్షురాలు జలజ, ఉపాధ్యక్షురాలు స్రవంతి, గడ్డమీద రమేష్, సరస్వతి అనురాధ, అరుణ, తంగిడిపల్లి శంకర్, సింధూర, మేకల వెంకటేష్, చంద్రశేఖర్, నర్సింలు, సౌజన్య, మమత, వసంత, హాజీపల్లి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

 

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?