Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ (Prabhakar Rao) ప్రభాకర్ రావును కస్టడీకి తీసుకుని విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో ఆగస్టు 5వ తేదీ వరకు ప్రభాకర్ రావును (Prabhakar Rao) అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీం కోర్టు కల్పించిన రిలీఫ్‌ను తొలగించాలంటూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని నిశ్చయించారు. ఇందులో భాగంగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, సిట్ విచారణ అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఢిల్లీ చేరుకున్నారు.
Also Raad: Ponguleti Srinivas Reddy: మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కార్.. లోకల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అమలు
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో సిట్ విచారణను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసులు నమోదు కాగానే అమెరికా పారిపోయిన (Prabhakar Rao) ప్రభాకర్ రావును పలు ప్రయత్నాల అనంతరం వెనక్కి రప్పించారు. అయితే, తిరిగి రావడానికి ముందు తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ప్రభాకర్ రావు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు (Supreme Court) ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేస్తూ అప్పటివరకు ప్రభాకర్ రావుపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ పోలీసు అధికారులకు సూచించింది. అదే సమయంలో విచారణకు పూర్తిగా సహకరించాలని ప్రభాకర్ రావును ఆదేశించింది. ఇలా సుప్రీం కోర్టు కల్పించిన ఈ రక్షణతో తిరిగి వచ్చిన ప్రభాకర్ రావు సిట్ విచారణకు ఏమాత్రం సహకరించడం లేదు.
ఐదుసార్లు.. 40గంటలకు పైగా
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు (Prabhakar Rao) నోరు తెరుస్తే దీని వెనక ఉన్న సూత్రధారులు ఎవరన్నది బయట పడుతుందని సిట్ అధికారులు భావించారు. ఈ క్రమంలో తిరిగి వచ్చిన తరువాత ప్రభాకర్ రావును ఐదుసార్లు 40 గంటలకు పైగా విచారించారు. అయితే, విచారణ జరిపిన ప్రతీసారి ప్రభాకర్ రావు (Prabhakar Rao) దర్యాప్తు అధికారుల సహనానికి పరీక్ష పెట్టారు. (Phone Tapping) ఫోన్ ట్యాపింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, పై అధికారుల ఆదేశాలనే అమలు చేశానని చెబుతూ వచ్చారు. తానేం చేశానో పై అధికారులందరికీ తెలుసని చెప్పారు.
ఫలానా వాళ్ల ఫోన్లు ట్యాప్ చేయాలని వ్యక్తిగతంగా తాను ఎలాంటి ఉత్వర్వులు ఇవ్వలేదన్నారు. అయితే, ఇదే కేసులో అరెస్టైన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు తదితర నిందితులు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా విచారణలో వెల్లడించారు. వీళ్లు ఇచ్చిన వాంగ్మూలాలను ముందు పెట్టి ప్రశ్నించినా ప్రభాకర్ రావు (Prabhakar Rao) తాను చెప్పాలనుకున్నది మాత్రమే చెప్పారు. తప్పితే ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) సూత్రధారులు ఎవరన్నది వెల్లడించలేదు.
రక్షణ తొలగించేలా చర్యలకు శ్రీకారం
ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టు (Supreme Court) కల్పించిన రక్షణను తొలగించేలా చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు విచారణలో భాగంగా కేసులోని నిందితులు, బాధితులు ఇచ్చిన వాంగ్మూలాలను సుప్రీం కోర్టుకు సమర్పించి ప్రభాకర్ రావుకు కల్పించిన రిలీఫ్‌ను తొలగించాలంటూ పిటిషన్ వేయాలని నిర్ణయించారు. ఒక్కసారి రిలీఫ్ తొలగిపోతే ప్రభాకర్ రావును (Prabhakar Rao) కస్టడీకి తీసుకుని మరింత నిశితంగా విచారించ వచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి డీసీపీ విజయ్ కుమార్, సిట్ విచారణాధికారి వెంకటగిరిలు గురువారం ఢిల్లీ వెళ్లారు.
Also Read: Telangana: ఇండియా మ్యాప్‌లో తెలంగాణను మరిచారా.. అక్కర్లేదా?