Rajinikanth ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్మెంట్

Rajinikanth: ఇండస్ట్రీలోనే తొలిసారి.. రిస్క్‌ చేయబోతున్న రజినీకాంత్ తేడా వస్తే.. కోలుకోలేని దెబ్బే

Rajinikanth: సినిమా ప్రమోషన్స్‌లో టీజర్, ట్రైలర్‌ల విడుదల ఒక సంప్రదాయంగా మారింది. ఇవి సినిమాకు హైప్‌ క్రియేట్‌ చేయడమే కాక, కొన్నిసార్లు అంచనాలు లేని కాంబినేషన్‌లను కూడా ఆకర్షణీయంగా మార్చాయి. టీజర్‌, ట్రైలర్‌ల వల్ల సినిమాలకు భారీ ఓపెనింగ్స్‌ వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సోషల్‌ మీడియాతో ఈ ప్రమోషనల్‌ కంటెంట్‌ అవసరం మరింత పెరిగింది. కొన్నిసార్లు టీజర్‌, ట్రైలర్‌లు సరిపోకపోతే, రిలీజ్‌ ట్రైలర్‌ ను కూడా విడుదల చేస్తున్నారు.

Also Read: Tummala NageswaraRao: తెలంగాణకు యూరియా సరఫరా.. కేంద్రంతో సంప్రదింపులు.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌కు ఇవి కీలకంగా మారాయి. అయితే, ‘సలార్‌’, ‘కల్కి 2898 AD’, ‘దేవర’ వంటి సినిమాల విషయంలో టీజర్‌, ట్రైలర్‌లు ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్‌ చూపలేకపోయాయి. దీంతో రిలీజ్‌ ట్రైలర్‌లు విడుదల చేయాల్సి వచ్చింది. కానీ, ఒకప్పుడు, అంటే ‘మగధీర’ సినిమా రిలీజ్ సమయంలో టీజర్‌, ట్రైలర్‌ల ప్రాముఖ్యత అంతగా లేదు. టీవీ, థియేటర్‌లలో రిలీజ్ చేసేవారు. అప్పట్లో సినిమా రిలీజ్‌కు బాగా  హడావుడి ఉండేది.

Also Read: Dating app Scam: వృద్ధుడిపై కన్నేసిన యువకులు.. ఇలా ఉన్నారేంట్రా.. ఇంకెవరూ దొరకలేదా?

ఇప్పుడు ఆ పాత రోజులను తిరిగి తీసుకురావాలని ‘కూలి’ టీం భావిస్తోంది.లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న ‘కూలి’ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్‌ ఖాన్‌ వంటి స్టార్లు కూడా ఉన్నారు. ఈ సినిమాపై తమిళంతో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక్క టీజర్‌ కూడా విడుదల చేయకుండానే ఈ సినిమా బిజినెస్‌ పూర్తయింది, నిర్మాతలు భారీ లాభాలు ఆర్జించారు. అందుకే ‘కూలి’ టీం టీజర్‌, ట్రైలర్‌లు విడుదల చేయకుండానే సినిమాను రిలీజ్‌ చేయాలని నిర్ణయించింది.

Also Read:  Soothravakyam: వివాదాస్పద నటుడు షైన్ టామ్ చాకో పోలీస్‌గా నటించిన సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?

ఇది నిజంగా పెద్ద సాహసమే  అనే చెప్పుకోవాలి.  ఒకవైపు ఇది మంచి ఆలోచనే అయిన , మరోవైపు కొంత రిస్క్‌ కూడా. ఎందుకంటే, కథ, కథనాల గురించి ఆడియన్స్‌కు ముందస్తు ప్రమోషన్ లేకుండా  సినిమాను నేరుగా విడుదల చేస్తే, ప్రేక్షకులు దాన్ని  ఎలా చూస్తారో అనేది  పెద్ద సందేహమే. మరి, ఈ సినిమా హిట్ అవుతుందో? లేదో? చూడాలి.

Just In

01

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!

Bandi Sanjay: కేటీఆర్‌పై గట్టి పంచ్‌లు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్