Congress Party (imagecredit:twitter)
Politics

Congress Party: కొండా ఫ్యామిలీ వర్సెస్ వరంగల్ ఎమ్మెల్యేలు.. సవాల్‌గా మారిన ఇష్యూ

Congress Party: కాంగ్రెస్ పార్టీ లోని చిక్కుముళ్లు విప్పేందుకు ముఖ్య నేతలు ప్రయత్నిస్తున్నా ఫలితాలు రావట్లేదు. పైగా పార్టీలోని వివాదాలు మరింత జఠిలమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా డైలీ సీరియల్ ఎపిసోడ్ గా కొనసాగుతున్న మంత్రి కొండా సురేఖ(Min Konda Surekha) దంపతుల వివాదానికి ఇప్పటికీ చెక్ పడలేదు. ఇప్పటికే రెండు సార్లు క్రమ శిక్షణ కమిటీ ఇరు వర్గాలతో డిస్కషన్ చేసింది. రెండు వర్గాల నుంచి వివరాలు సేకరించిన కమిటీ పార్టీ లైన్ క్రాస్ కావొద్దని సూచించింది. నేతలంతా సమన్వయంతో పనిచేయాల్సిందే అని నొక్కి చెప్పింది.

కానీ కొండా ఫ్యామిలీ వివాదం కంటిన్యూ అవుతునే ఉన్నది. ఈ వివాదానికి పుల్ స్టాఫ్​ పెట్టేందుకు క్రమ శిక్షణ కమిటీ సంఘం చైర్మన్ మల్లు రవి(Mallu Ravi) మరోసారి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, కీలక నాయకులతో మాట్లాడారు. గాంధీభవన్ లో వన్ టూ వన్ నిర్వహించారు. కానీ కొండా మురళీ పై చర్యలు తీసుకోవాల్సిందేనని ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో తేల్చేశారు. స్పష్టమైన ఆధారాలు పెట్టుకొని ఇంకెన్ని సార్లు పిలుస్తారు? అంటూ కొందరు ఎమ్మెల్యేలు క్రమ శిక్షణ కమిటీ ముందు వాపోయినట్లు తెలిసింది.

కార్యకర్తల్లో తప్పుడు సంకేతాలు
కమిటీ ముందుకు రావాలంటేనే అవమానంగా ఉన్నదంటూ వరంగల్(Warangala) జిల్లా ఎమ్మెల్యేలు తమ అసంతృప్తికి వ్యక్త పరిచారు. “తిట్లు మేం తిన్నాం…మమ్మల్ని నేరుగానే విమర్శించారు. మళ్లీ తమనే కమిటీ ముందు పిలిస్తే తమ ఫాలోవర్స్ ఏమి అనుకుంటారు”అని ఓ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్, కార్యకర్తల్లో తప్పుడు సంకేతాలు వెళ్​తున్నాయని ఎమ్మెల్యేలు(MLA) ఆవేదన వెలిబుచ్చారు. తమకు ఫ్రీ​రీ హ్యాండ్ ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యేలంతా క్రమ శిక్షణ కమిటీ ముందు వివరించారు. కొండా ఫ్యామిలీ ముఖ్యమా? ప్రజల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ముఖ్యమా? అనేది పార్టీ తేల్చాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్యేలు క్రమ శిక్షణ కమిటీని నిలదీశారు.

తాము కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నామని, కొండా ఫ్యామిలీ ఒక్కటే శ్​రమించినట్లు మాట్లాడటం సరికాదని ఓ ఎమ్మెల్యే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొండా ఫ్యామిలీ వర్సెస్ వరంగల్ ఎమ్మెల్యేల వివాదం కొలిక్కి రాకపోవడంతో క్రమ శిక్షణ కమిటీ కూడా సతమతమవుతున్నది. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఏం చేయాలనే దానిపై కమిటీ కసరత్తు చేస్తున్నది. ఎమ్మెల్యేలు, కొండా ఫ్యామిలీ అభిప్రాయాలకు పొంతన కుదరకపోవడంతో క్రమ శిక్షణ కమిటీ కూడా తల పట్టుకుంటున్నది.

Also Read: Ramachandra Rao: గజ్వేల్‌ల్లో కాంగ్రెస్ నేతలకు షాక్.. బీజేపీకి కొత్త బలం

ఏఐసీసీ ఇన్ చార్జీకు కొండా ఫ్యామిలీ కంప్లైంట్
పార్టీని డ్యామేజ్ చేసేందుకు కొందరు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని, తాము ఆ విధానాన్ని వ్యతిరేకిస్తున్నందుకే తమపై ఫిర్యాదు చేశారని కొండా సురేఖ దంపతులు ఇటీవల ఏఐసీసీ(AICC) ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) కు సూచించారు. తమను ఓర్వలేకనే అసత్య ఫిర్యాదులు చేస్తున్నట్లు వివరించారు. పూర్తి స్థాయిలో స్టడీ చేసి తాను నిర్ణయం తీసుకుంటానని ఏఐసీసీ ఇన్ చార్జీ మీనాక్షి గతంలో ప్రకటించారు. ఒకవైపు ఎమ్మెల్యేలు, మరోవైపు మంత్రి దంపతులు ఇలా ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు చేసుకోవడంపై ఏఐసీసీ ఇన్ చార్జీ కూడా సీరియస్ గానే ఉన్నారు. పార్టీ కోసం సమన్వయం కాలేరా? అంటూ ఇటీవల ఆమె ఇరు వర్గాలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

మీటింగ్ తర్వాత కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకునేందుకు క్రమ శిక్షణ కమిటీకి కన్ క్లూజన్ లభించలేదు. దీంతో కమిటీ ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, జూన్ 19న రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా వరంగల్ లో నిర్వహించిన సభలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ సొంత పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై కాంగ్రెస్9Congress) ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, కడియం శ్రీహరి(Kadiyam Srihari), ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణలు లిఖిత పూర్వకంగా క్రమ శిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మొదలైన వివాదం ఇంకా సమిసిపోలేదు.

రిపోర్టు వచ్చాక సొల్యుషన్ ఇస్తా: చైర్మన్ మల్లు రవి
‘‘నేను డాక్టర్ని.సమస్య ఏంటి అనేది పూర్తిగా తెలుసుకొని మందు ఇస్తాను. ఇప్పుడే టెస్టులకు శాంపిల్స్ సేకరిస్తున్నాను. రిపోర్ట్స్ వచ్చాక సొల్యూషన్ వెతుకుతాం. సమస్యతెలుసుకోకుండా మందు ఇస్తే, ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. అలా జరగకూడదని ఆచితూచి వ్యవహరిస్తున్నాం. భేటీ లోపల జరిగే విషయాలు బయటకు చెప్పవద్దని ఎమ్మెల్యేలతో చెప్పాం. నేను కూడా భేటీ అంశాలు చెప్పలేను. క్రమ శిక్షణ కమిటీ త్వరలో అన్నిటినీ పరిష్కరిస్తుంది. వరంగల్ ఎమ్మెల్యేలు, మంత్రి కొండా దంపతుల వివాదంపై మరో సారి భేటీ ఉంటుంది. ఇరు వర్గాల నుంచి మరింత సమాచారం సేకరిస్తాం. అయితే ఎప్పుడు భేటీ నిర్వహిస్తామనేది త్వరలో చెప్తాం. క్రమ శిక్షణ కమిటీకి వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిష్కరిస్తాం. ఇలాంటి సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది దానిపై కూడా ఇప్పటికే ఫోకస్ పెట్టినాం అని అన్నారు.

Also Read: CM Revanth Reddy: గులాబీ బాస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్!

 

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?