KTR on India Map: భారతదేశ చిత్రపటం నుంచి మా చరిత్రనే తొలగిస్తే మేమెవరం? అని బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ(BJP) అధ్యక్షుడు మాధవ్(Madhav), ఏపీ మంత్రి లోకేష్(Nara Lokesh) కి ఇచ్చిన భారత చిత్రపటంలో తెలంగాణ(Telangana) లేకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ చిత్రపటం నుంచి తెలంగాణను తొలగించడం పై వెంటనే బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని భౌగోళిక గుర్తింపుని గుర్తించకపోవడం బీజేపీ అధికారిక విధానమా? అని ప్రధానిమోడీ(PM Modi)ని ప్రశ్నించారు.
ప్రశ్నార్ధకం చేసేలా భారతదేశ చిత్రపట
ఈ విషయంలో మోడీకి పలు ప్రశ్నలు సంధించారు. దశాబ్దాలపాటు తెలంగాణ సాంస్కృతిక గుర్తింపు కోసం, చరిత్రలో తమకు సరైన చోటు దక్కడం కోసం, ప్రత్యేక భౌగోళిక గుర్తింపు, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎనలేని పోరాటాలు చేసింది తెలంగాణ గడ్డ అన్నారు. అయితే మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మా సాంస్కృతిక గుర్తింపుని అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేసేలా భారతదేశ చిత్రపటాన్ని ఉపయోగించారని మండిపడ్డారు. అయితే, మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్ బహుమతిగా ఇచ్చిన మ్యాపులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని మాత్రమే చూపించడం దారుణం అన్నారు.
Also Read: Bharat Bandh: మా పొట్ట కొట్టొద్దు.. కార్మికులపై కక్ష సాధింపు చర్యలు ఎందుకు?
మోడీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్
తెలంగాణ రాష్ట్రం అస్తిత్వాన్ని లెక్కచేయకుండా చేసిన చర్య మమ్మల్ని తీవ్రంగా బాధించిందని, ఇది పూర్తిగా అనుచితమైందన్నారు. ఇది మీ పార్టీ అధికారిక అభిప్రాయమా? అని మోడీని నిలదీశారు. లేదా ఈ చర్య కేవలం ఒక పొరపాటా? అనే విషయంపై మీరు వెంటనే పీఎం మోడీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది తెలంగాణ(Telangana) ప్రజల త్యాగాలు, రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలను, బలిదానాలను అగౌరవపరచడమే కాకుండా మా చరిత్రను నిర్లక్ష్యం చేసిన బీజేపీ(BJP) నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పొరపాటైతే, తెలంగాణ ప్రజలని అపహాస్యం చేసినందుకు మీ పార్టీ నాయకత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని కోరారు.
Also Read: Etela Rajender: కల్తీ కల్లు ఘటనలో ఆరుగురి మృతి!