Illegal Constructions (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Illegal Constructions: అక్రమ నిర్మాణాలపై అధికారుల అలసత్వం

Illegal Constructions: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలంలో నేషనల్ హైవే రోడ్డు ప్రక్కన యాడేచ్చగా జి ప్లస్ త్రీ(G+3) అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. నోటీసులు అందజేసినప్పటికీ గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు నోటీసులు ఇచ్చి తెతులు దులుపుకుంటున్న పరిస్థితులు నెలకొన్నాయి.అధికారుల అండదండలతో లక్ష్మీదేవి పల్లి పంచాయతీ పరిధిలో ప్రధాన రహదారి ప్రక్కన అక్రమ జి ప్లస్ త్రీ నిర్మాణాలు పూర్తి కావొస్తూ ఊపందుకున్నాయి. మే నెల పనులను నిలుపుదల చేసిన అధికారులు పనులు వేగవంతం అవుతున్న అటువైపు కన్నెత్తి చూడక పోవడంతో ఆంతర్యం ఏంటి. పనులన్నీ పూర్తి కావొస్తున్న అధికారులు స్పందించక పోవడంతో పలు అనుమానాలకు తవిస్తుంది. కళ్ళ ముందు నిలువెత్తు సాక్షముగా పట్టపగలే పైన కవర్లు తొలగించి నిర్మాణాలు చేస్తుంటే కంటపడకపోవడం ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది.

పూర్తయ్యే వరకు సహకరిస్తున్నారా
నోటీసులు అందజేశాం అంటూ చేతులు దులుపుకుంటున్న పంచాయతీ అధికారులు. నోటీసులు అందజేస్తే నిర్మాణాలు ఆగిపోతాయా? అక్రమ నిర్మాణం అని తెలిసి నోటీసులు అందజేసి చేతులు దులుపుకుంటే ఎలా వాటిని ఆపే అధికారం ఎవరికి లేదా ? ఆపే అధికారం అధికారులకు లేదా అక్రమ నిర్మాణాలని ఆపాల్సిన అధికారులు వారికి అండగా నిలుస్తూ జి ప్లస్ త్రీ నిర్మాణం పూర్తయ్యే వరకు సహకరిస్తున్నారని ప్రజలు ఆరోపించడంలో ఎటువంటి సందేహం లేదు. లక్ష్మీదేవిపల్లి అన్నపురెడ్డిపల్లి చుంచుపల్లి పాల్వంచ,మండల పరిధిలో ఇంత పెద్ద అక్రమ నిర్మాణం జరుగుతున్న ఎంపీ ఓ కు కానీ పంచాయతీ కార్యదర్శి కానీ కనిపించ లేదంటారా లేదా ఇంకా ఏమైనా జరిగింటుందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Also Read: Samantha: సమంత, రాజ్ ని అక్కడే పెళ్లి చేసుకుంటుందా.. ఈ పోస్ట్ తో కన్ఫర్మ్?

జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణానికి సహకరించుతున్న ఎంపీ ఓ పంచాయతీ కార్యదర్శిల పై చర్యలు తీసుకోవాలనీ ప్రజలు కోరుతున్నారు.అనుమతులు లేకుండా నిర్మాణం మొదలుపెట్టిన మొదలుకొని జి ప్లస్ త్రీ నిర్మాణం పూర్తికావచ్చేవరకు అనగా కొన్ని నెలలుగా నిర్మాణం జరుగుతున్న అడ్డుకోకుండా నోటీసులు అందజేశాము అంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపణలు వెళ్ళివెత్తుతున్నాయి.

అధికారులు చేయవలసిన పనులు
అక్రమ కట్టడాలను ఆపే అధికారం వున్నా పనులు ఆపలేకపోవడం వెనుక ఎవరున్నారు అనేది తెలియాల్సివుంది. పంచాయతీ మండల జిల్లా అధికారులు.ప్రధాన రహదారుల ప్రక్కనే జి ప్లస్ త్రీ నిర్మాణాలు కొనసాగుతున్న అధికారుల కంటపడకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. మండల పంచాయతీ అధికారులు చేయవలసిన పనులు చేయకుండా జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణాలకు సహకరిస్తూ వారి నిర్మాణ పనులన్నీ పూర్తయ్యే విధంగా సహకరిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహమే లేదు.

దాదాపు నెల రోజులు కట్టడాలు నిలుపుదల చేసిన అధికారులు. మరి ఏమి జరిగిందో ఏమో ఇంతకుముందు నిర్మాణాలకు అడ్డుగా కవర్ కప్పి పనులు చేసిన వారు పైన కవర్లు తొలగించి పనులు చేస్తున్నారంటే ఏమిటి. ఇప్పటికైనా అధికారులు స్పందించి జి ప్లస్ త్రీ నిర్మాణాలను నిలుపుదల చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.

Also Read: Buck Moon 2025: మరికాసేపట్లో అద్భుతం ఆవిష్కృతం.. చూడకుంటే బాధపడాల్సిందే!

 

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!