MP Raghunandan rao (imagecredit:twitter)
Politics

MP Raghunandan rao: సీఎం రేవంత్ రెడ్డికి రఘునందన్ రావు బహిరంగ లేఖ

MP Raghunandan rao: ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం(Indiramma Housing Scheme)లో లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల(MLA)కు ఇచ్చినట్లే ఎంపీ(MP)లకు సైతం 40 శాతం కోటా కేటాయించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పేదలకు, బలహీన వర్గాలకు నూతన ఇండ్లు నిర్మించే కార్యక్రమం చేపడుతున్నందుకు సీఎంకు అభినందనలు తెలిపారు. ఇండ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం(Prime Minister’s Housing Scheme) ద్వారా నిధుల అనుసంధానం చేయడంపైనా ఆయన హర్షం వ్యక్తంచేశారు.

Also Read: Gangula Kamalakar: గడువు ముగిసినా టెండర్లు రద్దు చేయలేదు.. గంగుల కమలాకర్

రేవంత్ రెడ్డి గతంలో ఎంపీ
అయితే ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపికకు స్థానిక ఎమ్మెల్యేల(MLA)కు 40 శాతం కోటా కేటాయించారని తెలిపారు. ప్రజల మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యేలకు గౌరవమిస్తూ సీఎం రేవంత్(CM Revanth) తీసుకున్న నిర్ణయంపై సంతోషం వ్యక్తంచేశారు. అయితే తెలంగాణ(Telangana)లోని 17 మంది ఎంపీలకు కూడా మరో 40 శాతం లబ్ధిదారుల ఎంపిక కోటా కేటాయిస్తే బాగుంటుందని రఘుందన్ రావు సూచించారు. పార్టీలకతీతంగా అందరికీ ఈ అవకాశం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న గృహ నిర్మాణంలో లబ్ధిదారుల ఎంపికకు మరింత సహేతుకత లభిస్తుందని స్పష్టంచేశారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఎంపీగా పనిచేశారని, ఈ విషయంపై సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Also Read: Collector Hari Chandana: విద్య ఒక విలువైన సంపద.. చదువుపై ఏకాగ్రత పెంచుకోవాలి

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!