Ktr Bhaimsa attack
Politics

KTR: టైమ్‌పాస్.. సర్కార్

– 5 నెలలు దాటింది.. కాంగ్రెస్ చేసిందేంటి?
– టైమ్ పాస్ చేస్తోంది
– కాంగ్రెస్, బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది
– కేసీఆర్ బస్సు యాత్ర రాజకీయాల్లో కీలక మలుపు
– మెజార్టీ సీట్లు తమకేనన్న కేటీఆర్

Congress: పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి పూర్వవైభవం కోసం తహతహలాడుతోంది బీఆర్ఎస్. కానీ, బీజేపీ, కాంగ్రెస్ మాత్రం గులాబీ పార్టీకి అంత సీన్ లేదని తేల్చేస్తున్నాయి. మూడోస్థానానికే పరిమితం అవుతుందని గట్టిగా వాదిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్, బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఈ రెండు పార్టీలు ఢిల్లీలో కుస్తీలు, గల్లీల్లో దోస్తీలంటూ విమర్శలు చేశారు. ఎంపీ ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థుల్ని పెట్టి బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ కష్టపడిందని ఆరోపించారు. కేసీఆర్ బస్సుయాత్ర తెలంగాణ రాజకీయాలని మలుపు తిప్పిందన్నారు కేటీఆర్. కేసీఆర్ యాత్ర మొదలుపెట్టగానే బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు దిగొచ్చారని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్‌కు ప్రజల్లో ఇంకా ఆదరణ తగ్గలేదని, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు.

Also Read: Bhatti: నో డౌట్.. 14 సీట్లు కాంగ్రెస్‌వే

ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేకత స్పష్టంగా కనబడిందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడుతారని జోస్యం చెప్పారు. బీజేపీ పాలనలో ధరలు అడ్డగోలుగా పెంచారని మండిపడ్డారు కేటీఆర్. బీజేపీని గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి కష్టపడ్డారని విమర్శించారు. కేంద్రంలో ఎవరికీ మెజారిటి సీట్లు రావని, ప్రాంతీయ పార్టీలే కీలకం అవుతాయని చెప్పారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని ప్రజలకి అర్థం అయ్యిందన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో పారాషూట్ లీడర్లకి కాంగ్రెస్, బీజేపీ టికెట్లు ఇచ్చిందన్న కేటీఆర్, ఆ రెండు పార్టీలకు భారీ షాక్ తప్పదని హెచ్చరించారు. అధికారంలోకి రావడం కోసం ఇష్టమొచ్చిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్, 5 నెలలుగా టైమ్ పాస్ చేస్తోందని విమర్శించారు. గత ఎన్నికల్లో కొందరి స్వార్థంతో ఓడిపోయామని, పార్టీ కోసం కష్టపడిన అందరికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అత్యధికంగా మెజార్టీ సీట్లు బీఆర్ఎస్‌కే దక్కుతాయని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్.

Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్