prabhas bahubali 10 years ( image source ;X)
ఎంటర్‌టైన్మెంట్

Prabhas: ప్రభాస్ ‘బాహుబలి’కి పదేళ్లు… అయినా క్రేజ్ తగ్గలా!

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ (Baahubali 10 years) అప్పట్లో ఏ రేంజ్ హిట్ అందుకుందో అందరికీ తెలిసిందే. సినిమా వచ్చి పదేళ్లు అవుతున్నా ఇంకా ‘బాహుబలి’ క్రేజ్ తగ్గలేదు. తెలుగు సినిమా చరిత్రను బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అనేంతగా ఈ సినిమా ప్రభావం చూపింది. అప్పటివరకూ ఉన్న తెలుగు ఇండస్ట్రీ రికార్డులను ఈ సినిమా తిరగరాసింది. పాన్ ఇండియా లెవెల్‌లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తాను చాటి చెప్పింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రాంలో ప్రభాస్‌(Prabhas), రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎన్నో అంచనాల నడుమ జులై 10, 2015న ‘బాహుబలి: ది బిగినింగ్‌’ అనే పేరుతో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. రిలీజైన మొదటి షో నుంచే తెలుగు సినిమా రికార్డులు కొల్లగొడుతూ ప్రపంచ సినీ ప్రియులను ఎంతో ఆకట్టుకుంది.

Also Read –Virat -Rohit: విరాట్, రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వస్తున్నారోచ్!

బాహుబలి సినిమా పదేళ్లయిన సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఇప్పుడున్న ఇంటర్వెల్‌ సన్నివేశం కాకుండా.. వేరే సన్నివేశంతో ఇద్దామనుకున్నారు దర్శకుడు రాజమౌళి(Rajamouli). కానీ, విగ్రహం పైకి లేపిన తర్వాత విశ్రాంతి కార్డు వేస్తే బాగుంటుందని భావించి బిజ్జలదేవుడి డైలాగ్స్‌ అన్నీ తొలగించేశారని, శివుడు మాహిష్మతికి బయలుదేరే సన్నివేశాలను ‘నిప్పులే శ్వాసగా’ అని సాంగ్‌లా తీశారని రాజమౌళి తెలిపారు. ప్రతినాయకుడు అయిన బల్లాలదేవుడు పాత్ర కోసం చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చిందట. ముందుగా ఆ పాత్రకు హాలీవుడ్‌ నటుడు జేసన్‌ మమోవా అనుకున్నారు. అప్పటికే ఆయన ‘ఆక్వామెన్‌’, ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’తో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్నారు. తర్వాత ఆప్షన్ రానా దగ్గుబాటిని అనుకోగా.. బళ్లాలదేవుడు పాత్ర వేసే అవకాశం చివరికి రానాకు దక్కింది. దీంతో నిర్మాత శోభు యార్లగడ్డ రానాను కలిసి ‘బాహుబలి’ కథ చెప్పగా రానా దానికి అంగీకరించారు. కట్టప్ప పాత్రకు సైతం ముందు బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ను తీసుకోవాలని చిత్రబృందం భావించింది. ఆయన అందుబాటులో లేకపోవడంతో సత్యరాజ్‌ను సంప్రదించగా ఆయన ఓకే చెప్పారు. ఇలా పాత్రలలో అనుకోని వారు కూడా ‘బాహుబలి’ సినిమాలో వచ్చి చేరారు.

Also Read – Viral News: రెజ్యూమ్ ఇలా కూడా తయారు చేస్తారా?.. షాక్‌లో కంపెనీ యజమానులు

‘బాహుబలి’ సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకుని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయాయి. ఈ మధ్య కాలంలో వచ్చన ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’, ‘కల్కీ’ సినిమాలు ప్రభాస్ స్థాయిని మరో సారి అమాంతం పెంచాయి. ఈ ఏడాది డిసెంబర్ 5 ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్ మూవీ ‘ది రాజాసాబ్’ పై ఇప్పటికే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా నిర్మాత ఎస్‌కేఎన్ ‘ది రాజాసాబ్’ సినిమా షూట్‌లో దిగిన ఫోటో ఒకటి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. స్టైలిష్‌గా ఉన్న ప్రభాస్ లుక్‌ను చూసి కంటెంట్ ఉన్నోడి కటౌట్ ఇలానే ఉంటుందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు