Harbhajan Rules Out SRH Playoff Chances Whats Their Path Forward
స్పోర్ట్స్

IPL 2024: నో ఛాన్స్‌ అంటూ మాజీ ప్లేయర్‌ హాట్ కామెంట్స్

Harbhajan Rules Out SRH Playoff Chances Whats Their Path Forward:ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ టోర్నీ నుంచి ఇప్పటికే ఈ రేసు నుండి ఇంటి బాట పట్టాయి. మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిచి తదుపరి దశకు చేరుకోవాలనుకున్న గుజరాత్ ఆశలకు వరుణుడు నీళ్లు చల్లాడు. అహ్మదాబాద్ వేదికగా జరగాల్సిన కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.దీంతో గుజరాత్ టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది.

మరోవైపు కేకేఆర్ జట్టు మాత్రమే ప్లేఆఫ్స్‌కు అధికారికంగా క్వాలిఫై అయ్యింది. మిగిలిన మూడు స్థానాల కోసం రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడుతున్నాయి. ఈ జట్లలో రాజస్థాన్‌ తదుపరి దశకు చేరుకోవడం దాదాపు ఖాయమైంది. మిగిలిన రెండు స్థానాల కోసం జరిగే ఫైట్ టఫ్‌గా ఉండనుంది. సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్, ఎల్‌ఎస్‌జీ తమ తదుపరి మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే 16 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. నెట్‌రన్‌ రేటు మెరుగ్గా ఉన్న జట్లు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా సునాయాసంగా ప్లేఆఫ్స్‌కు చేరుతాయి.

Also Read: కోహ్లిపై వైరల్ కామెంట్స్‌ చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

అయితే ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ అర్హత సాధించవని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ జోస్యం చెప్పాడు.కేకేఆర్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్, సీఎస్‌కే, ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవుతాయని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. అయితే 12 మ్యాచ్‌లు ఆడి 14 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్ టోర్నీ నుంచి ఎలా నిష్క్రమిస్తుందని భజ్జీ వ్యాఖ్యలతో ఆరెంజ్ ఆర్మీ ఏకీభవించట్లేదు. కానీ సాంకేతికంగా హైదరాబాద్ జట్టు టోర్నీ నుంచి నాకౌట్ అయ్యే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి.

Just In

01

Kishan Reddy: జూబ్లీ హిల్స్‌లో నామినేషన్ తర్వాత కనిపించని బీజేపి నాయకులు

Tragedy Love Story: ఐదు రోజుల్లో పెళ్లి.. ప్రియురాలిని మింగేసిన గోదావరి.. లవ్ స్టోరీలో తీవ్ర విషాదం

Mahesh Kumar Goud: ఎమ్మెల్యేలకు డీసీసీ ఇచ్చే అవకాశం: టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్

School Holidays: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. స్కూళ్లకు మూడురోజులు సెలవులు

Bigg Boss Telugu Nominations: నామినేషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మాజీ కంటెస్టెంట్స్ రీఎంట్రీ.. గూస్ బంప్స్ ప్రోమో భయ్యా!