Keerthy Suresh: మహానటి ఫేమ్ కీర్తి సురేష్ రాజకీయ రంగస్థలంపై అడుగుపెడతారా? సోషల్ మీడియాలో ఈ ఊహాగానాలు హోరెత్తుతున్నాయి. ఆమె బాలీవుడ్ డెబ్యూ ‘బేబీ జాన్’ ఆశించిన ఫలితం రాకపోవడం, పెళ్లి తర్వాత సినిమా అవకాశాలు తగ్గడం ఈ చర్చలకు దారి తీస్తున్నాయి. ఇటీవల మధురైలో ఓ ఈవెంట్‌లో అభిమానులు “టీవీకే… టీవీకే ” అని కేరింతలు కొట్టడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దళపతి విజయ్ స్థాపించిన “తమిళగ వెట్రి కళగం (TVK Party)కు ” కీర్తి మద్దతు పలుకుతారా? లేక రాజకీయాల్లోకి వస్తారా? అనే ప్రశ్నలు నెటిజన్లు అడుగుతున్నారు.
విజయ్‌తో కలిసి రెండు సినిమాల్లో నటించిన కీర్తి, ఆయనతో మంచి స్నేహ బంధం ఉంది. కీర్తి పెళ్లికి విజయ్ హాజరు కావడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. కీర్తి ఇటీవల తన స్నేహితుడు ఆంటోనీని వివాహం చేసుకుని కొత్త జీవితంలో అడుగుపెట్టారు. సినిమాలతో పాటు ఇతర రంగాల్లో తన ప్రతిభ చాటాలనే ఆలోచనలో ఉన్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Naga Chaitanya: చైతూ అప్పటి వీడియో ఇప్పుడెందుకు వైరలవుతోంది.. సమంతే కారణమా?
అయితే, గతంలో ఓ ఇంటర్వ్యూలో “రాజకీయాలపై తనకు ఆసక్తి లేదు” అని కీర్తి చెప్పిన మాటలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. రాజకీయ ఎంట్రీపై కీర్తి స్పష్టమైన సమాధానం ఇవ్వకపోయినా, ఆమె తాజా వైఖరి చూస్తే రాజకీయాల గురించి ఆలోచిస్తున్నట్లే కనిపిస్తోంది. అభిమానులు మాత్రం “కీర్తి రాజకీయ రంగంలోకి వస్తే ఖచ్చితంగా గెలుస్తుంది” అని చర్చించుకుంటున్నారు.
Also Read: GHMC Commissioner Karnan: ఫుడ్ సేఫ్టీపై స్పెషల్ ఫోకస్.. రంగంలోకి జీహెచ్ఎంసీ అధికారులు!