Gurukulam Institutions (imagecredit:twitter)
తెలంగాణ

Gurukulam Institutions: గురుకులాల్లో సీట్ల బ్లాకింగ్.. తలలు పట్టుకుంటున్న ఆఫీసర్లు

Gurukulam Institutions: గురుకుల విద్యా సంస్థల సీట్ల కేటాయింపుపై వివాదం నెలకొన్నది. ఎస్సీ(SC) గురుకుల విద్యా సంస్థల అడ్మిషన్ల ప్రాసెస్ మరీ దారుణంగా తయారైందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఎంపీ(MP), ఎమ్మెల్యే(MLA), మంత్రుల లెటర్లు, సిఫారసులతో సీట్ల బ్లాకింగ్ లు జరుగుతున్నాయనే ఆరోపణలు అత్యధికంగా వినిపిస్తున్నాయి. ర్యాంకులు రాకున్నా వాళ్ల లెటర్లు ఉంటే సులువుగా అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతున్నట్లు తెలుస్తున్నది. అధికారులు కూడా ప్రజాప్రతినిధుల సిఫారసులు తిరస్కరించలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు. పొలిటికల్(Political) లీడర్ల నుంచి ప్రెజర్లు తమకెందుకులే అన్నట్లు ఎస్సీ గురుకుల అధికారులు వ్యవహరిస్తున్నారు.

అధికారులు చేస్తున్న నిర్లక్ష్యానికి నైపుణ్యవంతమైన విద్యార్ధులు నష్టపోవాల్సి వస్తున్నట్లు స్వయంగా ఎస్సీ(SC) గురుకుల అధికారుల్లో కొందరు ఆఫ్​ ది రికార్డు(Of The Record)లో చెప్తున్నారు. ఇక సెక్రటరీ కూడా విద్యార్ధుల కంటే ప్రభుత్వ పెద్దలు, పొలిటికల్ లీడర్లకే ప్రాధాన్యత ఇస్తారనే చర్చ ఎస్సీ గురుకుల సంస్థలోనే ఉన్నది. రెండు రోజుల క్రితం ఇదే అంశంపై సెక్రటరీని కలిసి చర్చించేందుకు కొందరు పేరెంట్స్ ప్రయత్నించారు. కానీ ఆమె సమయం ఇవ్వలేదని ఓ పేరెంట్ చెప్పారు.

Also Read: Fish: వర్షాకాలంలో చేపలు అదే పనిగా లాగించేస్తున్నారా… అయితే, డేంజర్లో పడ్డట్టే?

ఏజెంట్ల ద్వారా కూడా..?
గురుకులాల్లో సీట్లు ఇప్పిస్తామంటూ కొందరు ప్రజాప్రతినిధుల ఫాలోవర్స్ పేరెంట్స్ ను ఆకట్టుకుంటున్నారు. తాము చెప్తే సీట్లు తప్పక వస్తాయంటూ భరోసా కల్పిస్తూ డబ్బులు వసూల్ చేస్తున్నారు. ఈ విషయం ఇటీవల గురుకుల సంస్థ కూడా గుర్తించింది. తప్పుడు లెటర్లతో పాటు డబ్బులు తీసుకొని సీట్లు ఇప్పిస్తున్నట్లు ఎస్సీ గురుకుల సొసైటీ గుర్తించింది. ఆ తర్వాతనే పైరవీ కారులతో జాగ్రత్త అంటూ ఎస్సీ గురుకుల సంస్థ ఓ ప్రత్యేకమైన నోట్ ను కూడా ఇటీవల రిలీజ్ చేసింది.

లీడర్లకు అతి సన్నిహితంగా ఉన్న వాళ్లే దళారులుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సొసైటీ కూడా ఏమీ చేయలేకపోతున్నది. ఇక ఇప్పటి వరకు ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు ఇలా సుమారు 5 నుంచి 6 వేలకు పైగా సీట్ల కోసం లెటర్లు వచ్చినట్లు సొసైటీ అధికారులు ఆఫ్​ ది రికార్డులో చెప్తున్నారు. దీంతో ఎవరికి అభ్యంతరం వ్యక్తం చేయలేని పరిస్థితుల్లో ఉన్న అధికారులు నేరుగా ప్రభుత్వానికి లేఖ రాయాలని భావిస్తున్నారు. ఈ లెటర్ల ద్వారా ఎలా సీట్ల భర్తీ చేయాలనే దానిపై క్లారిటీ ఇవ్వాలని ఎస్సీ గురుకుల సొసైటీ కోరనున్నది.

Also Read: Bharat Bandh: మా పొట్ట కొట్టొద్దు.. కార్మికులపై కక్ష సాధింపు చర్యలు ఎందుకు?

 

 

Just In

01

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది

Kalvakuntla Kavitha: దూకుడు పెంచిన కవిత.. జాగృతిలో భారీగా చేరికలు.. నెక్ట్స్ టార్గెట్ బీసీ రిజర్వేషన్లు!

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్