Cm Revanth Reddy Aim Is To Strengthen Congress party Energy
Politics

Revanth Reddy: గెలుపు ధీమా!.. 13 సీట్లు పక్కా

– ముగిసిన పార్లమెంట్ యుద్ధం
– పోలింగ్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
– పార్టీకి ఓట్ల శాతం పెరిగిందని నేతల అంచనా
– 13 స్థానాల్లో పక్కాగా గెలుస్తామని ధీమా

Telangana: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల యుద్ధం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. రాష్ట్రంలో 65 శాతం దాకా పోలింగ్ జరిగింది. ప్రధాన పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. అయితే, అధికార కాంగ్రెస్ 13 స్థానాల్లో గెలుపు పక్కా అంటోంది. ఈ క్రమంలోనే తన నివాసంలో పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, నియోజకవర్గాల ముఖ్య నేతలతో మాట్లాడారు. పోలింగ్ జరిగిన తీరుపై సమీక్ష జరిపారు.

13 పక్కాగా గెలుస్తామని ధీమా

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, గ్యారెంటీల అమలు బూస్టప్‌లా పని చేశాయని, రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లను గెలుచుకుంటామని అంటున్నారు ఆపార్టీ నేతలు. అన్ని చోట్లా పోలింగ్ తమకు అనుకూలంగా జరిగిందని, ఓటర్లు ప్రజాపాలనను ఆశీర్వదించారని సీఎంకు వివరించారు. ఇప్పటివరకు ఉన్న సర్వేల రిపోర్టులు, పార్టీ నేతల అభిప్రాయాలు, వివిధ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో 13 సీట్లు పక్కాగా గెలుస్తామనే అంచనాకొచ్చారు.

Also Read: ఫ్లైట్‌లో ఖమ్మం ఎమ్మెల్యేలు, మంత్రి పొంగులేటి.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కూడా!!

ఓటు బ్యాంకు పెరుగుదలపై ఆశలు

అన్నిచోట్లా ఓటింగ్ కాంగ్రెస్‌కు అనుకూలంగా జరిగిందని అంటున్నారు హస్తం నేతలు. వంద రోజుల తమ ప్రజా పాలనకు ఓటేసేందుకు ప్రజలు మొగ్గు చూపారని తమ అభిప్రాయాన్ని సీఎంకు వివరించారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 39.40 శాతం ఓట్లు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి 4 నుంచి 5 శాతానికి మించి పార్టీ ఓటు బ్యాంకు పెరిగి ఉంటుందని అంచనా వేశారు.

థర్డ్ ప్లేస్‌లో బీఆర్ఎస్

వివిధ సర్వేల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ ప్రకారం 13 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు పక్కాగా గెలిచే అవకాశాలున్నాయని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ రెండో స్థానానికి పోటీ పడిందని, బీఆర్ఎస్ ఎక్కడా కూడా పోటీలో కనిపించలేదని తమకు అందిన సమాచారాన్ని విశ్లేషించుకున్నారు. నల్గొండ, భువనగిరి, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, మహబూబ్​ నగర్​, నాగర్​ కర్నూల్​, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్ సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తారని భావిస్తున్నారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా సానుకూలత ఉన్నప్పటికీ ఓటర్ల నాడి అంచనాకు చిక్కలేదనే అభిప్రాయానికి వచ్చారు. ఈ విషయాలనే సీఎం రేవంత్‌తో చర్చించారు.

Just In

01

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!