Two Died (imagecredit:swetcha)
తెలంగాణ

Two Died: వైద్యం వికటించి ఒకే రోజు ఇద్దరు మృతి

Two Died: కాసుల కక్కుర్తే పరమావధిగా ఇష్టానుసారంగా వైద్య చికిత్సలందిస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారు. ఒకే రోజు ఇద్దరు వైద్యం వికటించి మృతి చెందారంటేనే అర్థం అవుతుంది ఆ దవాఖానలో వైద్య చికిత్సలు ఏ మేరకు అందుతున్నాయో అర్థం చేసుకోవడానికి. మియాపూర్(Miyapur)లోని సిద్దార్థ్ న్యూరో హాస్పిటల్‌(Siddharth Neuro Hospital)లో ఒక ఘటన మరువకముందే మరొక ఘటన వెలుగులోకి వస్తోంది. వైద్యం వికటించి చనిపోయిన రోగుల కుటుంబ సభ్యులతో బేరం కుదుర్చుకుని విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఒకేరోజు ఇద్దరు మృతి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇంద్రేశం గ్రామానికి చెందిన యువకుడు అరవింద్ (24), విద్యుత్ స్తంభం పై నుంచి పడడంతో సిద్దార్థ్ న్యూరో హాస్పిటల్ కు తీసుకొచ్చారు. కాగా గత వారం రోజుల్లో అక్షరాల పది లక్షల ఫీజు వసూలు చేసి, రోగి ఆరోగ్యం క్రిటికల్ గా ఉందని హడావిడి చేసి చనిపోయానంటూ మంగళవారం నిమ్మళంగా కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఇదిలా ఉండగా మరో ఘటనలో ఊపిరితిత్తుల సమస్యతో హాస్పిటల్(Hospital) కు వచ్చిన మహమ్మద్ మోసిన్ (41),కు బ్రెయిన్‌లో రక్తం గడ్డ కట్టింది అంటూ సర్జరీ చేయగా వికటించి మంగళవారం మృతి చెందాడు. చికిత్స జరుగుతున్న రోజులు పేషెంట్ బంధువులను లోపలికి సైతం అనుమతించలేదని, ప్రాణాలు పోయాక సావు కబురు చల్లగా చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ వ్యక్తులు చనిపోయారంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. చేసేదేం లేక హాస్పిటల్ యాజమాన్యం ఇరువురి కుటుంబాలతో బేరం కుదుర్చుకుని సెటిల్ చేసుకున్నట్లు తెలిసింది. రూ. 2 లక్షలు ఒకరికి, రూ. 7 లక్షలు మరొకరికి ఇచ్చినట్టు సమాచారం.

Also Read: Minister Seetakka: గిరిజన ప్రాంతంలో నకిలీ పదం వినిపిస్తే సహించం!

గతంలోనూ ఇదే తీరు
అనారోగ్య సమస్యలతో కడపకు చెందిన యువతి హాస్పిటల్ కు రాగా వైద్యం అందిస్తున్నామంటూ లక్షల్లో గుంజి చివరకు మృతదేహాన్ని అప్పగించారు. కుటుంబ సబ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి విచారణకు ఆదేశాలివ్వగా, పూర్తి వివరాలు తెలుసుకున్న ఆరోగ్య శాఖ అధికారులు ఆపరేషన్ థియేటర్(Operation theater) సీజ్ చేశారు. ఆ ఘటన మరువకముందే హాస్పిటల్ లో మరిన్ని ఘటనలు జరగడం విడ్డూరంగా ఉంది. సిద్దార్థ్ న్యూరో హాస్పిటల్‌లో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు, అక్కడికి విచ్చేసే రోగులు తలలు పట్టుకుంటున్నారు. హాస్పిటల్‌లో వైద్య చికిత్సలు అందిస్తున్నారా? లేక రోగుల పై ప్రయోగాలు చేస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. వైద్య శాఖ అధికారులు తగు చర్యలు తీసుకుని ఇలాంటి హాస్పిటల్ నిర్వాహకుల పైన, దగాకు పాల్పడే వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

విచారణ జరిపిస్తా: వెంకటేశ్వర్ రావు(DMHO)
సిద్దార్థ హాస్పిటల్ పై గతంలోనూ ఫిర్యాదులు ఉన్నాయి. బాధితులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు తప్పితే ఫిర్యాదు చేయడం లేదు. దీనివల్ల వైద్యశాఖ తరపున కఠిన చర్యలు తీసుకోలేక పోతున్నాం. సిద్దార్ధ హాస్పిటల్ లో ఇద్దరు మృతి చెందిన ఘటనపై టీమ్‌ను పంపించి విచారణ జరిపిస్తామని అన్నారు.

డాక్టర్ల నిర్లక్ష్యమే అంటూ బంధువుల ఆందోళన
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని సుప్రిత్ హాస్పిటల్‌(Suprith Hospital)లో వైద్యం వికటించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటుచేసుకుంది. జనగామ జిల్లా కొడకండ్ల గ్రామానికి చెందిన పొన్నం పాండు రంగారావు అనే వ్యక్తి కడుపునొప్పితో హాస్పిటల్‌ను సందర్శించాడు. వైద్యం పొందుతున్న సమయంలో 3 గ్లూకోజ్ బాటిల్స్,12 ఇంజక్షన్లు వేయగా అది హెవీ డోస్(Heavy dose) అయిందని, దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. సాధారణ నొప్పితో వెళ్లిన మా తండ్రిని డాక్టర్ల నిర్లక్ష్యంతో తిరిగిరాని లోకాలకు పంపించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, గ్రామస్థులు డిమాండ్ చేశారు. వైద్యాధికారులు స్పందించి వైద్యం నిర్లక్ష్యం చేసి ప్రాణాలు పోవడానికి కారణం అయిన ఆస్పత్రిపై చర్యకు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బాధితులు డిమాండ్ చేశారు.

Also Read: Swetcha Effect: భూకబ్జాదారులను వదిలేదే లేదు.. ప్రభుత్వ భూములను కాపాడుతాం!

 

 

 

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?