Vana Mahotsavam program (imagecredit:twitter)
తెలంగాణ

Vana Mahotsavam program: సీఎం ప్రారంభించినా.. ఇంకా మొదలుకాని పనులు

Vana Mahotsavam program: గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) మహానగరంలో రోజురోజుకి పెరుగుతున్న పట్టణీకరణ, వాహానాల సంఖ్యలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు జీహెచ్ఎంసీ(GHMC) తరపున ఎలాంటి ప్రయత్నాలు జరగటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గులాబీ సర్కారు ప్రతి ఏటా హరితహారం కారక్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ, ఈ కార్యక్రమం కింద నాటిన మొక్కలను అధికారులు పరిరక్షించటంలో విఫలమయ్యారన్న విమర్శలున్నాయి.

కొత్తగా వచ్చిన సర్కారు హయాంలో కూడా వన మహోత్సవం కార్యక్రమం మొక్కుబడిగా జరుగుతుందన్న విమర్శలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరు జోన్ల పరిధిలోని 30 సర్కిళ్లలో మొత్తం 25 లక్షల మొక్కలను నాటాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇటీవలే రాజేంద్రనగర్ సర్కిల్ లో ప్రారంభించి మూడు రోజులు గడుస్తున్నా, జీహెచ్ఎంసీ ఎక్కడా కూడా వన మహొత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటిన దాఖలాల్లేవు.

గత సంవత్సరం కూడా ఆరు జోన్ల పరిధిలో
మహానగరంలో రోజురోజుకి పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టి, పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంచేందుకు మొక్కలు నాటేందుకు గత రెండేళ్లుగా నిర్వహించ తలపెట్టిన మన మహోత్సవ కార్యక్రమాన్ని అనూహ్యాంగా అడ్డంకులెదురవుతున్నాయి. జీహెచ్ఎంసీ(GHMC) ఆధ్వర్యంలో లక్షల మొక్కలను, అలాగే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(HMDA) ఆధ్వర్యంలో కోట్ల సంఖ్యలో మొక్కలను నాటేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసినా, అవి ఎందుకు ఫలించటం లేదన్న ప్రశ్నకు అధికారులు సైతం జవాబు చెప్పేందుకు నీళ్లు నములుతున్నారు.

Also Read: Viral News: చాక్లెట్ తీసుకోలేదని మహిళను చంపేశాడు.. సీన్ కట్ చేస్తే..!

ముఖ్యంగా గత సంవత్సరం కూడా ఆరు జోన్ల పరిధిలో వివిధ రకాల సుమారు 30 లక్షల మొక్కలు నాటేందుకు జీహెచ్ఎంసీ ప్లాన్ చేయగా, బిల్లులు చెల్లించలేదంటూ కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటంతో కార్యక్రమం అడపాదడపాగా నిర్వహించి, ముగించేశారు. ఈ సారి వర్షాకాలంలో వానల కాస్త ముందుగానే కురుస్తున్నా, మొక్కలు నాటేందుకు జీహెచ్ఎంసీ ప్రతిపాదనలను సిద్దం చేసినా, ఇప్పటి వరకు వన మహోత్సవ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించిన చోట పలు రకాల మొక్కలను నాటిన జీహెచ్ఎంసీ ఇంకా ఎక్కడా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన దాఖలాల్లేవన్న వాదనలున్నాయి.

మళ్లీ అదే అడ్డంకి
ముఖ్యంగా మొక్కలు నాటడంతో ఏర్పడే ప్రయోజనాలతో పాటు ప్రతి ఒక్కరు ఒక మొక్కనైనా నాటాలన్న ఒక మంచి సందేశంతో నిర్వహించాల్సిన వన మహోత్సవం కార్యక్రమంపై జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారించటం వల్లే ఈ సారి వర్షాకాలం మొదలైనా, వన మహోత్సవ కార్యక్రమం పట్టాలెక్కలేదంటూ పలువురు పర్యావరణ ప్రియులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ నిర్వహించనున్న వన మహోత్సవం కార్యక్రమానికి ఒకటిన్నర అడుగుల లోతు వరకు గుంతలు తవ్వటంతో పాటు నాటిన మొక్కల పరిరక్షణకు ట్రీ(Tree) గార్డులను కూడా ఏర్పాటు చేయాల్సిన పనులను కాంట్రాక్టర్లు నిర్వర్తించాల్సి ఉంది.

కానీ గత సంవత్సరం వన మహోత్సవం కార్యక్రమానికి ఎదురైన సమస్యే ఈ సారి కూడా ఎదురైనట్లు విశ్వసనీయ సమాచారం. కాంట్రాక్టర్లకు రూ.వందల కోట్లు బిల్లులు బకాయిలున్నందున వన మహోత్సవం పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ససేమిరా అంటున్నట్లు తెలిసింది. ప్రస్తుతం చిరుజల్లులు కురుస్తు నాటి మొక్కలు ఎదిగేందుకు వీలైన వాతావరణ పరిస్థితులున్నందున, జీహెచ్ఎంసీ వీలైనంత త్వరగా వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించి, టార్గెట్ గా పెట్టుకున్న 25 లక్షల మొక్కలను నాటాలని పర్యావరణ ప్రియులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Kannappa: అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ‘కన్నప్ప’ స్పెషల్ షో..

 

Just In

01

School Holidays: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. స్కూళ్లకు మూడురోజులు సెలవులు

Bigg Boss Telugu Nominations: నామినేషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మాజీ కంటెస్టెంట్స్ రీఎంట్రీ.. గూస్ బంప్స్ ప్రోమో భయ్యా!

Highest Paid Actors: రెమ్యునరేషన్లలో వెనక్కి తగ్గేదే లే అంటున్న సౌత్‌ యాక్టర్లు..

Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?