Rashmika Mandanna: ‘సోలో’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా, ఇప్పుడు ఆకాశమే హద్దుగా పాన్ ఇండియా లెవెల్‌లో తన సత్తా చాటుతుంది. ‘గీతా గోవిందం’ సినిమా హిట్ తర్వాత అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగుతో పాటు తమిళం, కన్నడలో బిజీ హీరోయిన్ అయిపోయింది. రీసెంట్‌గా ‘యానిమల్’, ‘ఛావా’ సినిమాలతో హిందీ సినిమాల్లోకి ప్రవేశించి బంపర్ హిట్ అందుకుంది. దీంతో పాన్ ఇండియా స్థాయి అభిమానులకు నేషనల్ క్రష్ అయిపోయింది. ‘పుష్ప’ సిరీస్ సినిమాలతో ఇండస్ట్రీ హిట్ కొట్టి తన స్థాయి అమాంతం పెంచుకుంది. తర్వాత విడుదలైన ‘యానిమల్’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇటీవల విడుదలైన ‘కుబేర’ తెలుగులో మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇలా తాను చేసిన సినిమాలు చాలా వరకూ ఇండస్ట్రీ హిట్ కావడంతో హిట్ భామగా పేరు తెచ్చుకుంది.
Read Also- Gold ETFs: గోల్డ్ ఈటీఎఫ్‌లకు పెట్టుబడుల వరద.. జూన్‌లో 613% వృద్ధి.. కారణాలివే!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఓ మ్యాగజైన్ కోసం తీసిన ఫోటో షూట్‌లో హాట్ హాట్ ఫోజులిస్తూ కుర్రకారును హీటెక్కిస్తుంది. బోల్డ్ హై-ఫ్యాషన్ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా ది డర్టీ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటో షూట్‌లో రష్మిక కనిపించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అది నిజంగానే రష్మిక ఫొటోనేనా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆమెను చూస్తుంటే ‘మల్లన్న’ సినిమాలో శ్రేయ లాగా ఉన్నదని అభిమానులు అంటున్నారు. అయితే రష్మిక ఇలాంటి లుక్ లో కనిపించడం ఇదే మొదటిసారి. కర్లీ హెయిర్, డార్క్ మేకప్, ఎడ్జీ స్టైలింగ్‌తో కనిపించడంతో అభిమానులు ముందు కంగారుపడ్డారు. తర్వాత నేషనల్ క్రష్ రష్మికలో వచ్చిన మార్పును స్వాగతిస్తున్నారు. ఒక దానికే పరిమితం కాకుంగా ఇలా మ్యాగజైన్ కు ఫోజులివ్వడం మంచిదే అంటున్నారు. దీంతో ఆమె రేంజ్ కూడా మరింత పెరుగుతుందని ఆశిస్తున్నారు.
Read Also- YS Jagan: చిత్తూరు పర్యటనలో లాఠీఛార్జ్.. వైఎస్ జగన్‌ను టచ్ చేసిన ఎస్పీ!
ప్రస్తుతం రష్మిక మందన్నా నటిస్తున్న తాజా చిత్రం ‘మైసా’ ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలై మంచి వ్యూస్ తెచ్చుకుంది. సినిమా విమర్శకులు సైతం పొగిడేలా ఈ లుక్ ఉంది. అందులో కష్మిక వీరంగన్ లుక్‌లో ప్రేక్షకులను షాక్‌కి గురిచేసింది. ఈ సినిమాను ‘అన్ ఫార్ములా ఫిల్మ్స్’ నిర్మిస్తుండగా, రవీంద్ర పూలే దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఇలా రష్మిక మంచి కంటెంట్ ఉన్న కథలు ఎంచుకుని హిట్లమీద హిట్లు కొడుతుంది. ఇదిలా ఉండగా ‘కుబేర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడుతూ.. రష్మికను చూస్తుంటే ‘క్షణ క్షణం’ సినిమాలో శ్రీదేవి గుర్తుంస్తుందని అన్నారు. దీంతో అమ్మడు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఆ మాటతో ఆమె అభిమానులు కూడా ఫిదా అయ్యారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.