YS Jagan Chittor Tour
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

YS Jagan: చిత్తూరు పర్యటనలో లాఠీఛార్జ్.. వైఎస్ జగన్‌ను టచ్ చేసిన ఎస్పీ!

YS Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో అభిమానులు, రైతులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బంగారుపాళ్యంకు (Bangarupalem) తరలివచ్చారు. ఈ పర్యటన సందర్భంగా పోలీసులు అడ్డంకులు సృష్టించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ అభిమానులు, కార్యకర్తలు తమ ప్రియతమ నాయకుడి కోసం తరలివచ్చారని చెబుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్‌ (Lathi Charge) చేశారు. వైసీపీ యువజన విభాగం కార్యదర్శి శశిధర్ రెడ్డిపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో అతడి తలకు బలమైన గాయమై, రక్తస్రావం జరిగింది. దీంతో పోలీసుల చర్యలు, లాఠీఛార్జ్‌పై జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగారుపాళ్యం వద్ద కారు దిగేందుకు మాజీ సీఎం ప్రయత్నించారు. వైసీపీ శ్రేణులను కొట్టారని కారు దిగేందుకు జగన్‌కు తెలియడంతో కారును ఆపారు. లాఠీఛార్జ్‌లో గాయపడిన కార్యకర్త వద్దకు వెళ్లేందుకు ప్రయ‌త్నించ‌గా జగన్‌ను కారు దిగకుండా ఎస్పీ మణికంఠ అడ్డుకుని అడ్డుకున్నారు. జగన్‌ కారు దిగకుండా, అక్కడి నుంచి పంపించేశారు. దీంతో, చిత్తూరు పోలీసులపై మాజీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల లాఠీచార్జ్‌లో గాయపడిన పార్టీ నేతను పరామర్శించనివ్వరా? అంటూ పోలీసుల తీరుపై మండిప‌డుతూ.. ఇదెక్కడి న్యాయం? ఏమిటీ అరాచకం? అంటూ ధ్వజ‌మెత్తారు.

Read Also- Oh Bhama Ayyo Rama: సుహాస్‌ని విజయ్ సేతుపతితో పోల్చిన రాక్ స్టార్.. విషయమేంటంటే?

అడుగడుగునా..?
బంగారుపాళ్యంలో పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పోలీసుల చెక్ పోస్టులు, వాహనాల తనిఖీలు చేస్తూ జగన్ కాన్వాయ్ వాహనాలనూ లెక్కించి పంపుతుండటం గమనార్హం. హెలిప్యాడ్ నుంచి మార్కెట్ యార్డు వరకు రోడ్డు పొడవునా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. తనిఖీల్లో భాగంగా ఒక ఎస్కార్ట్ వాహనాన్ని కూడా పోలీసులు ఆపేశారు. వైసీపీ నేతల కార్లకూ అనుమతి లేదంటూ నిలిపివేశారు. హైవే మీద బారికేడ్లు పెట్టి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. వాస్తవానికి.. ఇవాళ ఉదయం నుంచే జగన్‌ పర్యటనపై అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్‌ పర్యటనలో పాల్గొనకూడదని వందలాది మందికి నోటీసులు జారీ చేయడం, రౌడీషీట్లు తెరుస్తామని బెదిరించడం చేస్తున్నారని మండిపడుతున్నారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డుకు రైతులు రాకుండా వి.కోట మండలం కారకుంట వద్ద పోలీసుల తనిఖీలు, వీడియో రికార్డు చేస్తుండటం గమనార్హం. ముఖ్యంగా బైరెడ్డిపల్లి మండలం కైగల్ వద్ద కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు చేప‌ట్టి రైతుల‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి తీవ్ర అభ్యంత‌రం వ్యక్తం చేశారు. జగన్‌ పర్యటనలకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వస్తుండటంతో టీడీపీ కూటమి సర్కారు అడుగడుగునా ఆంక్షలు విధిస్తోందని మండిపడ్డారు.

Read Also- Viral News: 30 రోజుల్లో రూ.20 లక్షలు అప్పుతీర్చిన మహిళ.. ఆలస్యమెందుకు మీరూ కానిచ్చేయండి!

ఇదేం పద్ధతి..?

త‌మ బాధ‌లు మాజీ సీఎంకు చెప్పుకునేందుకు బంగారుపాళ్యెం వ‌చ్చిన రైతుల‌పై పోలీసులు లాఠీచార్జ్ చేయ‌డం దారుణ‌మ‌ని వైసీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే వెంక‌టేశ్‌ గౌడ్ మండిప‌డ్డారు. జగన్ పర్యటనకు రాకుండా రైతులను పోలీసులు అడ్డుకుంటున్నార‌ని ఫైర్ అయ్యారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డును పోలీసు నిర్బంధంలోకి వెళ్లింద‌ని, అటువైపు వస్తున్న వాహనాలు బయట ప్రాంతంలోనే నిలిపి వేస్తున్నార‌ని త‌ప్పుప‌ట్టారు. రైతులను, వైసీపీ నాయకులను నిర్బంధించ‌డం దుర్మార్గమ‌న్నారు. ఇది అప్రజాస్వామికం.. ఇంత దారుణంగా కక్ష్య సాధింపు చర్యల‌కు పాల్పడ‌టం స‌రికాద‌ని, రైతులను వీడియోలు తీసి బెదిరించ‌డం దారుణ‌మ‌ని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. మరోవైపు.. బైక్‌పై బంగారుపాళ్యంకి వెళ్తున్న చిత్తూరు నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జ్ విజయనందా రెడ్డిని పోలీసులు ఆపేశారు. ఎందుకు ఆపుతున్నారు..? అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా వింత వాదనకు దిగడం గమనార్హం. అయితే కార్లకు పర్మిషన్ లేదనడంతో.. బండి మీద కూడా వెళ్తున్నా అడ్డుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై లాఠీఛార్జ్ ఇలా అరాచకాలు చేసేది మీరు.. ఆరోపణలు మాత్రం వైసీపీ పైనా చంద్రబాబు? అంటూ వైసీపీ తీవ్రంగా స్పందిస్తోంది.

Read Also- YS Jagan: నల్లపురెడ్డి బూతులు వినసొంపుగా ఉన్నాయా జగన్?

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?