Venu Swamy: గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో జ్యోతిష్యం చెప్పే వేణు స్వామి పేరు మార్మోగుతోంది. అయితే, ఇటీవల ఆయన చుట్టూ నెగెటివిటీ పెరిగిపోయింది. ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేను ఎవరికీ భయపడను.. నా దగ్గరికి పెద్ద డాన్‌లు, కాల్ గర్ల్స్ కూడా వస్తారు. వాళ్లే నన్ను ‘ మీకేం కావాలో చెప్పండి’ అని అడుగుతారు. నేను వాళ్ల దగ్గర ఏమీ అడగను. అలా ఉండే నేను వీరి బెదిరింపులకు నేను బెదురుతానా?” అని ధీమాగా సవాల్ విసిరారు.
Also Read : KTR Challenges CM Revanth: చర్చకు రాకుంటే ముక్కు నేలకు రాసి సారీ చెప్పాలి.. కేటీఆర్ సంచలన కామెంట్స్!
ఆయన మాటల్లోని ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. “చివరకు నన్ను జైల్లో వేసినా నాకు భయం లేదు. కలియుగంలో జైలు శిక్ష అంటే ఏమీ కొత్త కాదు. ఎందరో మహానుభావులు జైలు జీవితం గడిపారు. వాళ్ల ముందు నేనెంత?” అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో నెటిజన్లు సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ కామెంట్ల వర్షం కురిపించారు. “ఏంటీ, కాల్ గర్ల్స్, పెద్ద డాన్‌లా? వస్తున్నారా ?
అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తే, మరికొందరు ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
Also Read: Fish: వర్షాకాలంలో చేపలు అదే పనిగా లాగించేస్తున్నారా… అయితే, డేంజర్లో పడ్డట్టే?