Swetcha Effect: మల్టీ నేషనల్ మొక్కజొన్న కంపెనీల ఆర్గనైజర్లతో మోసపోయిన ఆదివాసీ రైతులకు పంట నష్ట పరిహారం అందింది. ‘స్వేచ్ఛతోనే సమస్యలకు పరిష్కార మార్గం’ అంటూ ప్రచురితమైన కథనాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)స్పందించి రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి (Anvesh Reddy) లను ఆదివాసీ రైతుల పంట క్షేత్రాలకు పంపారు. వారు క్షేత్రస్థాయిలో సందర్శించి వివరాలను సేకరించి పరిహారం అందించే దిశగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ సైతం ఆదివాసీలు చేసిన వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి నష్టాలకు గల కారణాలను తెలుసుకున్నారు. మల్టీ నేషనల్ కంపెనీల ఆర్గనైజర్లు చేసిన మోసాలను గుర్తించారు. నిరక్షరాస్యతతో వ్యవసాయం చేస్తున్న ఆదివాసీలను మోసం చేయడం నేరమని నలుగురు ఆర్గనైజర్లపై సీడ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అంతేకాకుండా మరో ఇద్దరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును సైతం నమోదు చేసి ఆర్గనైజర్లకు తగిన బుద్ధి చెప్పారు.
Also Read: Minister Seetakka: గిరిజన ప్రాంతంలో నకిలీ పదం వినిపిస్తే సహించం!
స్వేచ్ఛ కథనాలతో పంట నష్టపరిహారం
క్షేత్రస్థాయిలో సందర్శించిన వ్యవసాయ అధికారులు ఆర్గనైజర్లు ఇచ్చిన ఆఫర్లకు రైతులను కొంతమంది నష్టపోయేందుకు కారకులుగా మిగిలారు. నేటికీ సంబంధిత రైతులకు పరిహారం అందకపోవడం గమనార్హం. వ్యవసాయ శాఖలో కక్కుర్తికి పాల్పడిన క్షేత్రస్థాయి అధికారులను జిల్లా ఉన్నతాధికారులు గుర్తించి సస్పెండ్ చేయాలని రైతుల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయి. స్వేచ్ఛ కథనాలతో పంట నష్టపరిహారం అందడంతో రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పత్రిక అంటే పదిమంది ప్రజలకు న్యాయం చేసేదిగా ఉండాలని అందుకు ప్రత్యక్ష సాక్షిగా స్వేచ్ఛ నిలుస్తుందని అభినందించారు.
ఎట్టకేలకు పంట నష్ట పరిహారం చెక్కులు
ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మొక్కజొన్న పంట ద్వారా నష్టపోయిన ఆదివాసీ రైతులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. దాదాపు నాలుగు నెలల ఉద్యమం రైతులు చేసిన తర్వాత వారికి పరిహారం అందింది. సోమవారం వాజేడు మండల కేంద్రంలోని రైతు వేదికలో వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం మండలాల్లో 1521 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేసి నష్టపోయిన 671 మంది రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, సహకారం చేనేత వస్త్రాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్క, తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సమక్షంలో రూ.3 కోట్ల 80 లక్షల 97 వేల 264 విలువ గల చెక్కులను రైతులకు పంపిణీ చేశారు.
Also Read: Bhadradri Kothagudem: రెచ్చిపోతున్న కంకర మాఫియా.. నాసిరకం కంకరతో నిలువు దోపిడీ