Jabardasth Nukaraju: జబర్దస్త్ కమెడియన్ నూకరాజు, పటాస్ ఆసియా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై వీరిద్దరూ ఎంత పాపులర్ అయ్యారో మనందరికీ తెలిసిందే. తక్కువ సమయంలో క్రేజ్ తెచ్చుకున్న జంటలలో వీరు కూడా ఒకరు. వీరిద్దరూ “పటాస్” షో ద్వారా ప్రేక్షకులకు బుల్లితెరకి పరిచయమయ్యారు. ఆ తర్వాత జబర్దస్త్‌లో కూడా కలిసి స్కిట్స్‌లో నటించారు. వీరి మధ్య ఆన్-స్క్రీన్ లవ్ ట్రాక్‌తో పాటు, నిజ జీవితంలోనూ ప్రేమ సంబంధం ఉన్నట్లు చాలా మందికి సందేహం ఉంది. అయితే, తాజాగా వీరిద్దరూ ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్మలేని నిజాలు ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ప్రస్తుతం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
Also Read: Fish: చేపలు ఎన్ని రకాలు.. ఎలాంటివి తింటే ఆరోగ్యానికి మంచిది.. అసలెందుకు తినాలి?
నూకరాజు నా జీవితంలోకి వచ్చాక మొత్తం మారిపోయింది?
పటాస్ ఆసియా మాట్లాడుతూ నూకరాజు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నుంచి నా డ్రెస్సింగ్ మొత్తం మారిపోయింది. అబ్బాయిలకు ఇలా ఉంటేనే నచ్చుతుంది అంటూ తను చెప్పిన తర్వాత నుంచి నేను వేసుకునే డ్రెస్సింగ్ పూర్తిగా మారిపోయింది. నేను మొదట్లో అనుకునేదాన్ని ఎవరిష్టం వాళ్ళది కదా.. మనం ఒకరికి నచ్చాలని రూల్ లేదు కదా అని, కట్ చేస్తే మన మంచి కోసమే కదా చెప్పింది అని బాగా ఆలోచించి నన్ను నేను పూర్తిగా మార్చుకున్నా అంటూ ఆసియా చెప్పింది.
మా అమ్మ చెప్పినట్లే చెబుతాడు..
ఆమె ఇంకా మాట్లాడుతూ ఎవరైనా ట్రెండ్ ను ఫాలో అవుతారు. కానీ, నేను మాత్రం ట్రెడిషనల్ గా మారిపోయా నూకరాజు వలన. మా అమ్మ నా పక్కన ఉన్నా కూడా అలాగే చెబుతుంది కదా. తను ఒకే ఒక్కసారి చెప్పాడు నన్ను ఏం బలవంతం చేయలేదని చెప్పింది. కానీ, డ్రెస్సింగ్ గురించి చాలా సార్లు చెబుతూ ఉండేవాడు. అయితే, ఇతను ఎందుకు ఇలా చెబుతున్నాడు అనుకునే దాన్ని అంటూ చెప్పుకొచ్చింది.
Also Read: CPI Congress Alliance: సీపీఐ కాంగ్రెస్ మధ్య పొత్తు కొనసాగుతుందా? లేక ఈసారి ప్రత్యర్థులుగా నిలబడతారా?
అయితే, తాజాగా వీరిద్దరూ మరో పాటతో మన ముందుకు వస్తున్నారు. జబర్దస్త్ బాబు డైరక్షన్లో తెరకెక్కిన ” సల్లగుండరాదే ” సాంగ్ త్వరలో మన ముందుకు రాబోతుంది. దీనికి సంభందించిన ప్రోమో కూడా విడుదలైంది. అయితే, ఈ పాటలో ఆసియా పెళ్లి వేరే అబ్బాయితో జరుగుతుంది. మీరు కూడా ఈ పాటను వినేయండి..