Ajay Devgn: ఇటీవల జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (Telangana Gaddar Film Awards) వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను సినిమా హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం అన్ని సహకారాలు అందిస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు సినిమా ఇండస్ట్రీ నుంచి సరైన ప్రణాళికతో రావాలని ఆయన సూచించారు. దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) పేరును ప్రస్తావిస్తూ.. హాలీవుడ్ నుంచి కూడా హైదరాబాద్‌కు షూటింగ్ చేసుకోవడానికి రావాలని, అందుకు కావాల్సిన ఏర్పాట్లపై సినీ ప్రముఖులు దృష్టి పెట్టాలని, వారు ఏది అడిగితే అది ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి మాటిచ్చారు. ఆ అవకాశాన్ని వినియోగించుకునేందుకు ఇప్పుడు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ముందుకు వచ్చారు.
Also Read- Fish: చేపలు ఎన్ని రకాలు.. ఎలాంటివి తింటే ఆరోగ్యానికి మంచిది.. అసలెందుకు తినాలి?
తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి ప్రముఖ సినీ నటుడు అజయ్ దేవగణ్ (Ajay Devgn) విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన అధికారిక నివాసంలో అజయ్ దేవగణ్ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా సినీ నిర్మాణంలో కీలకమైన యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియో, ఏఐ, ఇతర సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టూడియో నిర్మాణాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని అజయ్ దేవగణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ స్థాయి స్టూడియో నిర్మాణంతో పాటు సినీ పరిశ్రమలో వివిధ విభాగాలకు అవసరమైన నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు అజయ్ దేవగణ్ సంసిద్ధత వ్యక్తం చేశారు.
Also Read- Tabu: 16ఏళ్ళ వయసులో ఆ హీరో టబుతో అలాంటి పని చేశాడా.. అందుకే ఆమె పెళ్లి చేసుకోలేదా?
ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్దికి తాము తీసుకుంటున్న చర్యలను, వివిధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను అజయ్ దేవగణ్‌కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ రైజింగ్‌కు సంబంధించి మీడియా, సినిమా రంగాలకు ప్రచారకర్తగా ఉంటానని అజయ్ దేవగణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేశారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.
మరో వైపు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్ ఇచ్చినా, తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా ఆ దిశగా ఆలోచించకపోవడం గమనార్హం. ముఖ్యంగా రాజమౌళి పేరును ప్రస్తావించి టీమ్‌ని రెడీ చేయమని తెలిపారు. కానీ ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కట్ చేస్తే, ఆ అవకాశాన్ని బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ వినియోగించుకునేందుకు ముందుకు రావడం విశేషం. చూద్దాం మరి దీనిపై టాలీవుడ్‌లో ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అజయ్ దేవగణ్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు