Sugar ( Image Source: Twitter)
Viral

Sugar: 30 రోజులు చక్కెర మానేస్తే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా?

Sugar: ప్రస్తుతం, మనం షుగర్ లేకుండా పూట గడవని పరిస్థితిలో ఉన్నాము. టీ, బిస్కెట్లు, కేకులు, స్వీట్లు వంటి వాటి ద్వారా చక్కెర మన శరీరంలోకి అధికంగా చేరుతోంది. అధిక షుగర్ వినియోగం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత కాలంలో షుగర్‌ను పూర్తిగా మానేయాలని, దాని స్థానంలో బెల్లం వాడాలని సూచిస్తున్నారు.

Also Read: Kingdom: విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ ఆరోజే విడుదల.. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తాడట!

షుగర్ అధికంగా తీసుకోవడం వల్ల డయాబెటిస్‌తో సహా అనేక వ్యాధులు వస్తున్నాయి.డయాబెటిస్ తక్కువ వయసులోనే వచ్చే పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. చిన్న పిల్లలకు కూడా ఈ వ్యాధి సులభంగా సోకుతోంది, దీనికి ప్రధాన కారణం షుగర్. అధిక షుగర్ వినియోగం డయాబెటిస్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు.

 Also Read: Watch Video: యూరప్ రావొద్దు.. వచ్చారో మీ పని అంతే.. భారతీయుడి స్ట్రాంగ్ వార్నింగ్!

చక్కెరకు 30 రోజుల పాటు దూరంగా ఉంటే  అనేక ఆరోగ్య సమస్యలకు నుంచి దూరంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. షుగర్ మానేస్తే కాలేయంలో కొవ్వు తగ్గుతుంది, కాలేయ సమస్యలు తలెత్తవు, మూత్రపిండాల పనితీరు కూడా మెరుగుపడుతుంది.గుండెపోటు, గుండె నొప్పి వంటి సమస్యల నుంచి కూడా రక్షణ పొందవచ్చు.  షుగర్ అధికంగా తీసుకోవడం వల్ల మానసిక స్థితి దెబ్బతింటుంది. దీనిని  30 రోజుల పాటు మానేస్తే ఆలోచనలలో స్పష్టత వస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది, మనం చేయాలనుకున్న పనిపై పూర్తి దృష్టి పెట్టగలము.

Also Read: Personal Finance: పెళ్లికి డబ్బులు కావాలా.. ఇలా చేయండి తిరుగుండదు!

షుగర్‌ను 30 రోజుల పాటు మానేస్తే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల, షుగర్ వినియోగాన్ని పూర్తిగా మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనిని క్రమంగా తగ్గించడం ద్వారా చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వారు చెబుతున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!