Sama Rammohan Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ చేసిన సవాల్‌పై టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి (Sama Rammohan Reddy) స్పందించారు. అన్ని అంశాలపై అమరవీరుల స్థూపం వద్దకు రా చర్చించుకుందాం అంటూ ఛాలెంజ్ చేశారు. ‘‘మీ హయంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) అంటే ఆయన ఎవరు అన్నావు. ఇప్పుడు ఆయన పేరు పక్కన నీ పేరు వస్తే చాలు అని తహతహలాడుతున్నావు. రైతుల సంక్షేమం మీద మాట్లాడేందుకు మీకు సిగ్గు ఉండాలి. పదేళ్లలో రైతులు చనిపోతే కనీసం పట్టించుకోలేదు. నీ సవాళ్లకు సామ రామ్మోహన్ రెడ్డి చాలు. సీఎంతో పోల్చుకోకు (KTR) కేటీఆర్.
Also Read: CM Revanth Reddy: పక్కా వ్యూహంతో ఢిల్లీకి సీఎం.. టీడీపీ బీజేపీకి చెక్ పెట్టేలా ప్లాన్!
రహస్య మంతనాలు ఎవరికి లబ్ధి
గోదావరి, కృష్ణలో తెలంగాణ వాటా కోసం ప్రభుత్వం పోరాటం చేస్తుంటే, బనకచర్ల ఆపేందుకు ప్రయత్నాలు చేస్తుంటే, నువ్వు మాత్రం ఏపీ మంత్రి (Nara Lokesh) నారా లోకేష్‌తో ఎందుకు భేటీ అయ్యావు. ఆ రహస్య మంతనాలు ఎందుకు’’ అంటూ నిలదీశారు. నారా లోకేష్‌తో కేటీఆర్ మంతనాలు ఒక్కసారి కాదు పలు మార్లు జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రహస్య మంతనాలు ఎవరికి లబ్ధి చేయడానికో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో స్పందించాలని, లోకేష్‌ను కలవలేదంటే అప్పుడు తాను వివరాలు బయట పెడతానని స్పష్టం చేశారు. తెర వెనుక రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నది ఎవరో మీ భేటీతో తేలిపోయిందని సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు.
Also Read: Mulugu District: చుక్క రమేష్ ఆత్మహత్యతో చెలరేగిన వివాదం!