Producer SKN: మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ‘బేబి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు యంగ్ నిర్మాత ఎస్‌కేఎన్. ఆయన నిర్మాణంలో ప్రస్తుతం కిరణ్ అబ్బవరం హీరోగా ‘చెన్నై లవ్ స్టోరీ’, హిందీ ‘బేబి’తో పాటు ఇద్దరు కొత్త దర్శకులతో ఇంట్రెస్టింగ్ మూవీస్ రాబోతున్నాయి. జూలై 7 ఈ యంగ్ నిర్మాత పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కెరీర్ విశేషాలను మీడియాకు చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూలో తెలుగు సినిమా ఇండస్ట్రీపై ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ..
‘‘ప్రస్తుతం పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా చేస్తున్నాం. చిన్న చిత్రమైనా, పెద్ద చిత్రమైనా కంటెంట్ బాగుండాలి. మేము కథ మీద నమ్మకంతోనే ‘బేబి’ మూవీకి వంద ప్రీమియర్స్ వేశాం. పెద్ద మూవీస్‌కు కూడా ఒక్క ప్రీమియర్ వేయాలంటే ఆలోచిస్తారు. ఈ రోజు ప్రేక్షకులు సినిమా వాళ్ల కన్నా పది రెట్లు షార్ప్‌గా ఉన్నారు. ఎంత హంగామా చేసినా సినిమాలో కంటెంట్ లేకుంటే థియేటర్స్‌కు రావడం లేదు. ప్రేక్షకుల్ని మెప్పించే ఒకే ఒక్క అంశం కంటెంట్. ఇప్పుడు మా నిర్మాణంలో ఉన్న ‘చెన్నై లవ్ స్టోరీ’తో పాటు మిగతా అన్ని ప్రాజెక్ట్స్ స్క్రిప్ట్ ఎగ్జైట్ చేసి, స్ట్రాంగ్ కంటెంట్‌తో రాబోతున్నవే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సలహాలు ఇచ్చేంత పెద్దవాడిని కాదు, కానీ ఒక జర్నలిస్ట్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు అనిపించినవి చెప్తా. రియాల్టీ అనే సైకిల్‌లో ఇండస్ట్రీ ఇప్పుడు నడుస్తుంది. ప్యాషన్ ఉంటే తప్ప ప్రొడక్షన్‌లోకి రావొద్దు. ఇక్కడ పది రూపాయిలు పెడితే ఇరవై వస్తుందని అస్సలు అనుకోవద్దు. పోతే మొత్తం పోతుంది.. వస్తే లాభం వస్తుంది. మన కష్టం అంతా ఒక్కరోజులో ఊడ్చిపెట్టుకుపోవచ్చు. నిర్మాతగా ఉండటం అనేది ముళ్లున్న సింహాసనం లాంటిది. ఇక్కడి గ్లామర్‌కు ఆకర్షితులై ప్రొడక్షన్ లోకి వస్తే నష్టపోతారు.
Also Read- Akira Nandan: అకీరా ప్యాంటుపై ట్రోలింగ్.. మెగా ఫ్యాన్స్ ఇచ్చి పడేస్తున్నారుగా!
నాకు సినిమానే లోకం, మరో వ్యాపకం లేదు. ప్రతి ఫ్రైడే వచ్చే మూవీస్ చూస్తుంటా. సినిమాల గురించే డిస్కషన్స్ చేస్తుంటా. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నా.. సినిమాల గురించే స్పందిస్తుంటాను. థియేటర్స్‌లో నేను సినిమాలు చూడలేక దూరంగా ఉన్నది ఒక్క కరోనా టైమ్ లోనే. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ ఒక థియరీ ఉంటుంది. మనం ఎవరికీ చెప్పనవసరం లేదు. కరోనా టైమ్‌లో ఓటీటీలు బాగా చూడటం వల్ల ప్రేక్షకులు స్ట్రాంగ్ కంటెంట్‌కు అలవాటు పడ్డారు. మామూలుగా సినిమా ఉంటే ఇప్పుడెవరికీ నచ్చడం లేదు. భారీ రెమ్యునరేషన్స్, లావిష్ ప్రొడక్షన్ చేసి సినిమాలో కంటెంట్ లేకుంటే పెట్టుబడి మొత్తం పోతుంది. నాన్ థియేట్రికల్ బాగా పే చేస్తుందని బడ్జెట్స్ పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి.. హీరోలకు నచ్చజెప్పుకోవాలి. మనం జ్వరం వస్తే పత్యం చేస్తాం. ఏది పడితే అది తినం. అన్నీ తినేస్తా అంటే మొత్తం పాడవుతుంది. ఇండస్ట్రీ కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉందని నా అభిప్రాయం.
Also Read- Kavya and Shivathmika: కావ్య, శివాత్మికల ఆ కోడింగ్ సంభాషణకు అర్థమేంటో తెలుసా?
శాటిలైట్, హిందీ రైట్స్, ఓటీటీ.. ఇలా ఒక్కో టైమ్‌లో ఒక్కోటి ప్రొడ్యూసర్స్‌కు బాగా పే చేస్తూ వచ్చింది. ఈ అన్ని దశల్లోనూ థియేటర్స్‌లో బాగా ఆడిన చిత్రాలే లాభాలు తీసుకొచ్చాయి. నిర్మాతలు కూడా థియేటర్స్‌లో ఆడిన సినిమాలే మనకు మంచివి అని గట్టిగా నమ్మితే ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలు బాగుంటాయి. హీరో, డైరెక్టర్ క్రేజీ కాంబోలో ఓటీటీ కోసం ఒక మూవీ చేసి అక్కడే మనకు 80 పర్సెంట్ వస్తుందనే ప్రాజెక్ట్స్ కొన్ని ఇటీవల వచ్చాయి కానీ, ఆ బబుల్ కూడా ఇప్పుడు బరస్ట్ అయ్యింది. మళ్లీ మన పాత రూట్స్‌లోకి వచ్చి థియేట్రికల్‌గా ఎంజాయ్ చేసే సినిమాలే చేయాల్సిఉంది.
నేను ప్రొడ్యూసర్ కావాలని ఇండస్ట్రీకి రాలేదు. కానీ అయ్యాను. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా మూవీ చేస్తున్నా. నా నెక్ట్స్ ఏంటి అనేది కాలం, నేను చేసే కష్టం, అది ఇచ్చే ఫలితం మాత్రమే చెబుతాయి. ఫ్యూచర్‌లో హీరోగా, డైరెక్టర్‌గా మారే ఆలోచన లేదు. అల్లు అర్జున్ నుంచి నాకు మోరల్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఆ విషయంలో డౌటే లేదు. నేను ఏదైనా ముందడుగు వేస్తుంటే, రిస్క్ చేస్తుంటే పడిపోతాననే భయం లేకుండా బన్నీ ఉన్నాడు అనే ధైర్యం ఉంటుంది. ఏడాదిన్నరలో రెండు చిత్రాలు చేయాలనేది ప్రస్తుతం అల్లు అర్జున్ టార్గెట్‌గా పెట్టుకున్నారు..’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు