Kavya and Shivathmika: కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram), శివాత్మిక రాజశేఖర్ (Shivathmika Rajasekhar).. ఈ టాలీవుడ్ యంగ్ హీరోయిన్లు తాజాగా సోషల్ మీడియాలో జరిపిన సంభాషణతో వార్తలలో వైరల్ అవుతున్నారు. అసలు వారిద్దరి సంభాషణకు అర్థం ఏమిటని? అంతా తెగ సెర్చ్ చేసేస్తున్నారు. కావ్య కళ్యాణ్ రామ్.. పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘గంగోత్రి’ సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన కావ్య.. ఇప్పుడు కత్తిలా తయారై హీరోయిన్ అవకాశాలు పట్టేస్తుంది. హీరోయిన్‌గా ‘బలగం’ (Balagam), ‘మసూద’ (Masoodha) వంటి చిత్రాలతో సక్సెస్‌లను కూడా అందుకుంది. ప్రస్తుతం కొన్ని చిత్రాలకు కమిటైన కావ్య కళ్యాణ్ రామ్.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటుంది. హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో ఎప్పుడూ వార్తలలో నిలుస్తుంటుంది. ఇప్పుడు కూడా కత్తి లాంటి ఫొటోలను షేర్ చేయగా.. మరో హాట్ బ్యూటీ శివాత్మిక ఆ ఫోటోలకు స్పందిస్తూ.. ‘వావ్.. హాయ్.. కమ్ టు మై హోమ్’ అని కామెంట్ చేసింది.
Also Read- Vijay Sethupathi: కొడుకు చేసిన పనికి సారీ చెప్పిన సేతుపతి.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత కావ్య నుంచి వచ్చిన కోడింగ్ రిప్లయ్, దానికి శివాత్మిక ఇచ్చిన మరో రిప్లయ్.. ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ సంభాషణలో వారిద్దరూ వాడిన కోడింగ్ పదాలు.. ఇంట్రస్టింగ్‌గా ఉండటంతో.. ఇదేదో తేడాగా ఉందే. ఇంటికి రమ్మని శివాత్మిక అనడం ఏంటో.. దానికి కావ్య ‘కజాకొల్లంబు?’ (Kazakolambu) అంటూ ప్రశ్నించడం ఏంటో? దానికి మళ్లీ శివాత్మిక.. ‘చేసుకుందాం.. నువ్వు రా.. కారకుజంబు’ (Kaarakuzhambu) అని ఇచ్చిన రిప్లయ్‌కి అర్థమేంటో తెలియక.. నెటిజన్లు అర్థం తెలిస్తే చెప్పండయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదేదో డబుల్ మీనింగ్‌లా ఉందని, వీరిద్దరూ ఏదో ప్లాన్ చేస్తున్నారని.. సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.
ఇక వారిద్దరి మధ్య జరిగిన సంభాషణకు అర్థం ఏంటంటే.. అదేం కోడింగ్ భాష కాదు. రాజశేఖర్ దంపతులు మద్రాస్‌లో ఉండి వచ్చిన వారు కావడంతో వారికి తమిళ్ పై మంచి పట్టుంది. వారి కుమార్తెలు ఇద్దరూ కోలీవుడ్‌లో అరంగేట్రం చేశారు కూడా. ఇంటికి రమ్మని పిలిచిన శివాత్మికతో.. ఇంటికి వస్తే కజాకొల్లంబు ఉంటుందా? అని కావ్య అడిగింది. ఇది తమిళనాడుకు చెందిన వంట పేరు. దానికి శివాత్మిక.. ‘దానితో పాటు కారకుజంబు కూడా చేసుకుందాం రా’ అని ఆహ్వానించింది. ఇవి రసం, చారు వంటి కర్రీస్‌కు సంబంధించిన పేర్లుగా తెలుస్తోంది. ఏదయితేనేం.. ఈ సంభాషణతో వీరిద్దరి పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి. శివాత్మిక విషయానికి వస్తే.. జీవితా, రాజశేఖర్ దంపతుల కుమార్తెగా అరంగేట్రం చేసిన శివాత్మికకు హిట్ అయితే పడలేదు కానీ, నటిగా మంచి గుర్తింపునే సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె మంచి హిట్ కోసం చూస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు