Akira Nandan: అకీరా ప్యాంటుపై ట్రోలింగ్.. ఫ్యాన్స్ ఇచ్చిపడేశారుగా!
Akira Nandan and Pawan Kalyan
ఎంటర్‌టైన్‌మెంట్

Akira Nandan: అకీరా ప్యాంటుపై ట్రోలింగ్.. మెగా ఫ్యాన్స్ ఇచ్చి పడేస్తున్నారుగా!

Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) పెద్ద కొడుకు అకీరా నందన్ గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. తాజాగా అకీరా నందన్ (Akira Nandan) ఫోటో ఒకటి ఇంటర్‌నెట్‌లో హల్ చల్ చేస్తుంది. ఇటీవల ఓ అధికారిక పర్యటన కోసం పవన్ మంగళగిరి వెళ్లగా ఆయనతో పాటు పెద్ద కొడుకు అకీరా నందన్, చిన్న కొడుకు మార్క్ శంకర్ (Mark Shankar) కూడా కనిపించారు. పవన్‌తో కలిసి కొడుకులు కూడా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కొడుకు గాయపడిన విషయం తెలిసిందే. తాజాగా మార్క్ శంకర్ ఇలా కనిపించడంతో మెగా అభిమానుల్లో సంతృప్తి నెలకొంది. ఇదిలా ఉండగా అదే ఫ్రేమ్‌లో ఉన్న పవన్ పెద్ద కొడుకు అకీరా నందన్‌పై అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అచ్చం పవన్ లాగే ఉన్నాడంటూ, నడక నడవడిక పవన్‌ను పోలే ఉన్నాయంటూ కితాబిస్తున్నారు.

Also Read- Viral News: డ్యూటీ చేయకుండానే 12 ఏళ్లుగా కానిస్టేబుల్‌కు శాలరీ

ఇదిలా ఉండగా ఇటీవల ప‌వ‌న్‌తో కనిపించిన అకీరా నందన్‌ ఫోటోను పవన్ యాంటీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. గ‌తంలో ప‌వ‌న్ కళ్యాణ్ వేసుకున్న ప్యాంటుని క‌ప్‌బోర్డ్ నుంచి అకీరా వేసుకొని వ‌చ్చాడంటూ కొంద‌రు ట్రోల్ చేస్తున్నారు. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం వారికి ధీటుగా కామెంట్లు పెడుతున్నారు. ఆ ప్యాంటు ఒకే డిజైన్ కలిగి ఉందని, అవి వేరు వేరు కలర్స్ అని రిప్లే ఇస్తున్నారు. అయినా తండ్రి ప్యాంటు కొడుకు వేసుకోవడంలో తప్పేం ఉందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయినా సైజులు విషయంలో చాలా తేడా ఉంటుందని, కలర్ కూడా కొంచెం వేరుగా ఉందని, కళ్ల సరిగ్గా పెట్టుకుని చూడండని.. మరికొంత మంది కౌంటర్స్ వేస్తున్నారు. ఏది ఏమైనా పవన్‌ను తన కొడుకులతో చూసి అభిమానులు పొంగిపోతున్నారు. అకీరా అచ్చం హీరోలా కనిపించడంతో సినిమాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Also Read- Naga Chaitanya: చైతూ అప్పటి వీడియో ఇప్పుడెందుకు వైరలవుతోంది.. సమంతే కారణమా?

ఎప్పుడెప్పుడు అకీరా ఎంట్రీ ఉంటుందా? అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అకీరా ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని సమాచారం. మ్యూజిక్‌, ఫైట్స్‌, మార్షల్ ఆర్ట్స్‌లోనూ ప్రావీణ్యం సాధిస్తున్నాడు. జపనీస్ ఆర్ట్ బో స్టాఫ్, కరాటే, బాక్సింగ్‌లతో మంచి నైపుణ్యం కలిగి ఉన్నాడని సమాచారం. మ్యూజిక్‌పై మంచి టచ్ ఉన్నదని ఓ సందర్భంలో రామ్ చరణ్ తెలిపారు. రేణు దేశాయ్ కూడా కొన్ని వీడియోలను పంచుకున్నారు. అకీరా ఎంట్రీ ఎప్పుడని ఇటీవల రేణు దేశాయ్‌ని అడగ్గా.. అకీరా ఎప్పుడు అనుకుంటే అప్పుడు సినిమాల్లోకి తీసుకురావడానికి అంతా సిద్ధంగా ఉన్నామని, అందులో ఎవరి బలవంతం లేదని ఆమె బదులిచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..