Viral News: ఆంజనేయ స్వామికి, నాగుపాముకు మధ్య పురాణాల్లో ప్రత్యక్షంగా ఒకరి తలపై మరొకరు ఉన్నట్లుగా సాధారణంగా కనిపించే ఘటనలు చాలా తక్కువ. అయితే ఖమ్మం జిల్లా వైరాలోని వల్లపురంలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకున్నది. నాగుపాము తలపై ఆంజనేయుడు ముఖ కవళికలు (ఆకారం) ఉన్నట్లు వల్లపురం గ్రామస్తులు చెబుతున్నారు. ఆదివారం పశువుల కాపలా కోసం వెళ్ళిన కొంతమంది కాపరులకు నాగుపాము కనిపించింది. జనాలను చూడగానే ఒక్కసారిగా పడగ విప్పిన నాగుపాము భయపెట్టింది. దీంతో భయభ్రాంతులకు గురైన పశువుల కాపరులు నాగుపామును కర్రలతో చంపేశారు. అనంతరం నాగుపాము తలను ఫోటో తీసి చూస్తే పాము తల ఆంజనేయుడి ముఖం ఆకారంలో ఉన్నట్లుగా గమనించారు. దీంతో రహదారికి ఇరువైపులా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు ఆ పామును చూసి ఆశ్చర్యపోయారు. గ్రామాల్లో ఉన్న ఆనవాయితీ ప్రకారం నాగుపామును చంపితే కాల్చివేయాలనే పద్ధతిని ఫాలో అయ్యారు. కర్రలు నాగుపామును పేర్చి కాల్చివేశారు. అనంతరం ఈ పామును ఎందుకు చంపామా..? అని పశువుల కాపరులు ఆందోళన చెందుతున్నారు. ఆంజనేయుడు ఆకారంలో ఉన్న పామును చంపితే ఏదైనా దోషం జరుగుతుందేమోనని కంగారు పడుతున్నారు. ఎవరినైనా పెద్దవాళ్లు, పాముల గురించి తెలిసిన పంతులును అడిగి దోష నివారణ చేసుకోవడానికి కాపరులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Also- HHVM: రిలీజ్‌కు ముందు వివాదంలో హరిహర వీరమల్లు.. టెన్షన్‌లో ఫ్యాన్స్!
చరిత్రలో ఇలా..!
రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకువెళ్ళినప్పుడు, సీత జాడ తెలుసుకోవడానికి ఆంజనేయుడు సముద్రంపై లంకకు ప్రయాణిస్తాడు. ఈ ప్రయాణంలో దేవతలు, గంధర్వులు, ఋషులు ఆంజనేయుడి శక్తిని పరీక్షించడానికి నాగులకు తల్లి అయిన సురసను పంపుతారు. సురస ఒక భయంకరమైన రాక్షసి రూపంలో వచ్చి, ఆంజనేయుడిని మింగడానికి తన నోటిని పెద్దది చేస్తుంది. ఆంజనేయుడు తెలివిగా, సురస నోటిని ఎంత పెద్దది చేస్తే, తాను అంతకంటే పెద్దగా మారతాడు. చివరకు సురస నోరు వంద యోజనాల దూరం తెరుచుకున్నప్పుడు, ఆంజనేయుడు అకస్మాత్తుగా తన రూపాన్ని బొటనవేలు అంత చిన్నదిగా మార్చుకొని, సురస నోటిలోకి ప్రవేశించి, ఆమె చెవి ద్వారా బయటకు వస్తాడు. ఈ విధంగా సురస పరీక్షలో నెగ్గి, తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఈ సంఘటన ఆంజనేయుడి తెలివితేటలు, వినయం, అసాధారణ శక్తిని తెలియజేస్తుంది. కాబట్టి, నాగుపాములకు సంబంధించిన ఒక ముఖ్యమైన పాత్ర (సురస) ఆంజనేయుడి ప్రయాణంలో భాగమైంది. అందుకే నాగుపాము-అంజన్నకు మధ్య అస్సలు పడదు. అలాంటిది ఇప్పుడు ఇలా నాగుపాము తలపైన ఆంజనేయుడి తల కనిపించడంతో పెద్దవాళ్లకు అంతుచిక్కడం లేదు. మరోవైపు నిపుణులు కూడా దీని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక యువత గూగుల్‌ను అడుగుతున్నా ఎక్కడా ఎలాంటి సమాచారం లేదు. దీంతో అద్భుతమే జరిగిందని.. అనవసరంగా పామును చంపేశారని ఆ పశువుల కాపరులను తిట్టిపోస్తున్న వాళ్లూ ఉన్నారు. దీనికి పరిష్కారమేంటో.. ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also- Gangster: గ్యాంగ్ లీడర్ భార్యతో అక్రమ సంబంధం.. సీన్ కట్ చేస్తే ఊహించని ట్విస్ట్