Raghurama: రఘురామకృష్ణరాజు.. ఈ పేరు, మనిషిని తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. రాజకీయాల్లోకి రాక ముందు నుంచే ఈయన పేరు మార్మోగిన పరిస్థితి. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాక రోజూ వార్తల్లో నిలుస్తూ వచ్చారు. ఎంతలా అంటే.. వైసీపీ (YSRCP) తరఫున ఎంపీగా గెలిచి రెబల్‌గా మారి.. ఆ పార్టీపైన, అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పైన తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఆఖరికి వైసీపీ ఓటమిలో కూడా తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత అరెస్ట్, తదుపరి పరిణామాలను తెలియనివేం కాదు. అనంతరం టీడీపీ తీర్థం పుచ్చుకొని ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి రఘురామకు మంత్రి పదవి దక్కాల్సి ఉంది కానీ.. అనివార్య కారణాల వల్ల రాలేదు. అయితే ఇప్పటికీ వైసీపీ అంటే అస్సలు పడదు.. వైఎస్ జగన్ అంటే ఒంటికాలిపై లేస్తుంటారు. అలాంటిది ఈయనకు మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుంది..? ఏమేం చేస్తారు..? అందులోనూ ఒక్కరోజు మంత్రి అయితే పరిస్థితి ఏంటి? అనే విషయాలపైన ఓపెన్‌గానే చెప్పేశారు. ఇంతకీ ఆయన మనసులో ఏముంది? ఏంటో తెలుసుకుందాం వచ్చేయండి.
Read Also- Kavya and Shivathmika: కావ్య, శివాత్మికల ఆ కోడింగ్ సంభాషణకు అర్థమేంటో తెలుసా?
ఒకటి కాదు.. రెండు కావాలి!
అమెరికాలో తానా (TANA) 24వ ద్వైవార్షిక మహాసభలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ మహాసభలకు రఘురామ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. మీడియా, సభికులు, ఎమ్మెల్యేల నుంచి పలు ప్రశ్నలు రాగా.. చాలా లాజిక్‌గా ఆర్ఆర్ఆర్ బదులిచ్చారు. ‘ ఒక్కరోజు గనుక మిమ్మల్ని రాష్ట్ర మంత్రిగా చేస్తే మీరు ఏ శాఖలు కోరుకుంటారు, ఏం చేస్తారు?’ అని మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. ఇందుకు రఘురామ బదులిస్తూ.. ‘ ఎమ్మెల్యేలు అందరూ పట్టుబట్టి నన్ను ఒక్కరోజు రాష్ట్ర మంత్రిగా చేస్తే హోం శాఖ (Home Department) కోరుకుంటాను. ఆ రోజు నాకు 8 గంటలు సమయం కచ్చితంగా కావాలి. అంతేకాదు ఒక్క రోజులోనే రెండు శాఖలు కావాలి. 6 గంటలు హోం శాఖ, ఇంకో 2 గంటలు వైద్యారోగ్య శాఖ కోరుకుంటాను. హోం శాఖ ఇస్తే రెడ్ బుక్ (Red Book) అమలు చేయను.. అది వేరే వాళ్ల దగ్గరుంది. నా దగ్గర మాత్రం బ్లడ్ బుక్ (Blood Book) ఉన్నది. నా రక్తపు ఛారలు అన్నీ నాకు నాటి నుంచి నేటికీ గుర్తున్నాయి. ఎవరేం అరాచకాలు చేశారో అవన్నీ గుర్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. అందుకే నా బ్లడ్ బుక్ ప్రకారం నేను ముందుకెళ్తాను’ అని రఘురామ మనసులోని మాటను బయటపెట్టారు. ఒక్కరోజు మంత్రి పదవి కావాలనే ఆర్ఆర్ఆర్ కోరిక పెద్దదే కానీ.. తీర్చేదెవరు..? ఎంతవరకూ సాధ్యమవుతుందేమో చూడాలి మరి.
అరెస్ట్ ఎందుకనీ..!?
నాడు వైసీపీ ప్రభుత్వంపై విద్వేషపూరిత ప్రసంగాలు, వివిధ వర్గాల మధ్య విద్వేషాన్ని పెంచుతున్నారని, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని రఘురామపై రాజద్రోహం (ఐపీసీ 124 ఏ, 153 బీ, 505, 120 బీ) కేసులు నమోదు చేశారు. అరెస్ట్ అనంతరం గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తరలించిన ఆర్ఆర్ఆర్‌ను విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపణలు వచ్చాయి. తనను రబ్బర్ బెల్ట్, లాఠీతో కొట్టారని, తన గుండెలపై కూర్చుని శ్వాస ఆడకుండా చేసి హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. తనకు వైద్య సహాయం, ఆహారం కూడా అందించలేదని తెలిపారు. 2024లో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, రఘురామ తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్, హత్యాయత్నంపై జూలై 11, 2024న గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా, నాటి ముఖ్యమంత్రి జగన్‌తో పాటు, సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి సహా మరికొందరిపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166 (ప్రభుత్వ ఉద్యోగి చట్టాన్ని ధిక్కరించడం), 167 (తప్పుడు పత్రం సృష్టించడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఈ కేసులోని నిందితులు అందర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు కూడా పోలీసులు నోటీసులు పంపారు.
హోం మాత్రమే ఎందుకు?
చూశారుగా.. ఆయన ఎందుకు అరెస్ట్ కావాల్సి వచ్చింది.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి..? అనేది క్లియర్ కట్‌గా అర్థమైంది కదా. అందుకే తనకు హోం మంత్రి పదవి ఇస్తే చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయని చెప్పకనే చెబుతున్నారన్న మాట. సింపుల్‌గా చెప్పాలంటే రివెంజ్ పాలిటిక్స్ చేస్తానని.. తనను ఈ పరిస్థితికి తెచ్చిన ఏ ఒక్కరినీ వదలబోనని.. సినిమా మొత్తం 6 గంటల్లో చూపించేస్తానని పరోక్షంగా వైసీపీ నేతలు, ఆ పార్టీ అధినేతను, నాటి అధికారులను రఘురామ హెచ్చరించారని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కాగా.. హోం మంత్రిపై ఆయన చేసిన కామెంట్స్ తాలుకూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వీడియోకు ఎవరికి తోచినట్లుగా వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు మాత్రం అంతా ఓకేగానీ.. బ్యాంక్ బుక్ ఎక్కడ..? బ్యాంక్ బుక్‌లో ఉండే బ్యాలెన్స్ కట్టండి అని సలహాలు ఇస్తున్నారు. ఇంతకీ బ్యాంకులకు ఎగ్గొట్టిన లెక్కల సంగతేంటి..? ఇప్పుడు హోం తీసుకుంటారు సరే తర్వాత పరిస్థితేంటి..? అప్పుడిక పరిణామాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోండి అంటూ వైసీపీ శ్రేణులు గట్టిగా ఇచ్చి పడేస్తున్నాయి. ఇక టీడీపీ నుంచి అయితే ఎలాంటి కామెంట్స్ వస్తాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అనుకుంటా..!
Read Also- Sandeep Raj: ‘సి’ దెబ్బకు దిగొచ్చిన సందీప్ రాజ్.. సీన్ మొత్తం మారిపోలా!
నాకు ఒక ఛాన్స్ వస్తే మాత్రం హోమ్ మినిస్టర్ అవుతాను.
ఆ తర్వాత Red Book ఉండదు అంత Blood Book మాత్రమే….
– @KRaghuRaju గారు..💥 pic.twitter.com/WRSzK7LbYL
— 𝗧𝗗𝗣 𝗧𝗿𝗲𝗻𝗱𝘀 (@Trends4TDP) July 6, 2025