Sandeep Raj AIR Issue
ఎంటర్‌టైన్మెంట్

Sandeep Raj: ‘సి’ దెబ్బకు దిగొచ్చిన సందీప్ రాజ్.. సీన్ మొత్తం మారిపోలా!

Sandeep Raj: సందీప్ రాజ్.. నటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాతగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ముఖ్యంగా వెనుకబడిన.. బడుగు, బలహీన వర్గాల నేపథ్యాల గురించి సినిమాలు తీయడంలో దిట్ట. ‘కలర్ ఫొటో’ (Colour Photo) సినిమా చూస్తే చాలు.. సందీప్ గురించి అంతకుమించి ఇంకేమీ చెప్పలేం. ఈ సినిమాతో దర్శకుడిగా అడుగుపెట్టిన ఆయనకు సూపర్ డూపర్ హిట్ ఖాతాలో పడటమే కాకుండా, ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఇది యంగ్ డైరెక్టర్‌కు విశేష గుర్తింపు తెచ్చిపెట్టింది. పలు సినిమాల్లో నటుడిగా కూడా కనిపించారు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘మిషన్ ఇంపాజిబుల్’, ‘అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్’, ‘డాకు మహారాజ్’, ‘భైరవం’ చిత్రాల్లో మెరిసి నటుడిగా అదుర్స్ అనిపించారు. ఇటీవల ఈటీవీ విన్‌ (ETV Win) లో విడుదలైన ‘AIR’ (ఆల్ ఇండియా ర్యాంకర్స్) అనే వెబ్ సిరీస్‌ విడుదలైంది. ఇందులో సందీప్ నటించడమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది కానీ, ఓ వివాదాస్పద సన్నివేశం పెద్ద రచ్చ.. అంతకుమించి చర్చకు దారితీసింది. వెబ్ సిరీస్‌లోని ఓ సన్నివేశంలో ఒక పాత్ర, జూనియర్‌లకు జీవితంలో విజయం సాధించడానికి వారి సొంత సామాజిక వర్గానికి (Community) చెందిన వారితో ఎలా ఉండాలి..? ఏం చేయాలి..? సామాజిక వర్గానికి చెందిన వారిని ఎలా చూడాలి..? అనే సలహాలు, సూచనలు ఇస్తున్నట్లుగా ఉంది. దీనికి తోడు, ఆ సన్నివేశంలో నేపథ్యంలో ‘C’ అక్షరం కనిపించడం కొంతమంది ప్రేక్షకులు, విమర్శకులు.. ఓ సామాజిక వర్గానికి చెందిన వారు కులం ఆధారిత వివక్షను ప్రోత్సహించినట్లుగా ఉందని మండిపడుతున్నారు. ఇప్పుడిదే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు, ఆగ్రహానికి దారితీసింది.

Read Also- Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి ఫిక్స్ అయినట్టే!

చింతిస్తున్నాం..!
ఈ సన్నివేశం కాస్త రెండు కులాల మధ్య చిచ్చుపెట్టినట్లుగా అయ్యింది. దీంతో సందీప్‌ను ఓ సామాజికవర్గం తిట్టిపోసింది. సోషల్ మీడియా, మీడియా వేదికగా తీవ్ర వ్యాఖ్యలతో తిట్టిపోసిన పరిస్థితి. అంతేకాదు ఏ సమాజిక వర్గం గురించి ఈ ప్రస్తావన వచ్చిందో అందులోని పెద్ద తలకాయలు కూడా ఫోన్లు చేసి గట్టిగానే ఇచ్చిపడేసినట్లుగా తెలిసింది. దీంతో ‘C’ దెబ్బకు సందీప్ దిగొచ్చాడు. అటు ఈటీవీ విన్.. ఇటు సందీప్ ఇరువురూ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. ఈ దెబ్బతో వివాదానికి కాస్త ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది. ఈ సన్నివేశంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో సందీప్ రాజ్ బహిరంగ లేఖ విడుదల చేశాడు. ‘ సిరీస్‌లోని సీన్ కంటెంట్ మిమ్మల్ని బాధపెడితే, అందులో భాగమైనందుకు నేను చాలా చింతిస్తున్నాను” అని పేర్కొన్నారు. అది ద్వేషంతో, ప్రచారంతో, లేదా ఏదైనా నిర్దిష్ట సమాజాన్నో, మతాన్నో లక్ష్యంగా చేసుకుని చేసింది కాదని వివరించారు. ఆ వివాదాస్పద సన్నివేశాన్ని తొలగించామని, భవిష్యత్తులో మరింత బాధ్యతగా కంటెంట్‌ను రూపొందిస్తానని హామీ ఇచ్చారు. ‘ రామోజీ గ్రూప్‌లో, మేము అందరి భావాలను గౌరవించడానికి, ఎవరినీ బాధపెట్టకుండా ఉండటానికి కట్టుబడి ఉన్నాం. AIR వెబ్ సిరీస్‌లోని అభ్యంతరకరమైన సన్నివేశాలన్నీ తొలగించబడ్డాయి. అభిమానులు, ప్రేక్షకుల మద్దతుకు ధన్యవాదాలు. ఈటీవీ విన్ ఎప్పుడూ ఎవ్వరినీ ఇబ్బందిపెట్టకుండా నిలకడగా, డిఫరెంట్ కంటెంట్‌ను అందిస్తుంది’ అని ఈటీవీ విన్ సీఈవో సాయి కృష్ణ వెల్లడించారు.

AIR Web Series

తప్పే.. క్షమించండి..!
‘ డాకు మహారాజ్’ అనే భారీ బ్లాక్‌బస్టర్ చిత్రంతో 2025ను అద్భుతంగా ప్రారంభించాను. ఆ సినిమాకు వచ్చిన ప్రశంసలు, ట్వీట్లు నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి.. మరింతగా పని చేయడానికి ప్రోత్సహించాయి. అయితే ఇప్పుడు అదే సోషల్ మీడియా అకౌంట్ల నుంచి, అదే వ్యక్తుల నుంచి వస్తున్న ద్వేషం నా హృదయాన్ని ఎంతగానో కలచివేస్తోంది. జనవరిలో వచ్చిన ప్రశంసలకు నేను అర్హుడినా? కాదా అనేది తెలియదు. కానీ, జూలైలో వస్తున్న ఈ ద్వేషానికి మాత్రం నేను అర్హుడినే. నేను చేసిన పనిని కప్పిపుచ్చుకోవడానికి లేదా సమర్థించుకోవడానికి ఈ లేఖ రిలీజ్ చేయట్లేదు. ఒక చిత్ర నిర్మాతగా ప్రేక్షకులే ఎల్లప్పుడూ సరైనవారు అనే నినాదాన్ని నేను నమ్ముతాను. ఒకవేళ ఆ నిర్దిష్ట కంటెంట్ (వివాదాస్పద సన్నివేశం) ఎవరినైనా బాధించి ఉంటే, అందులో నేను భాగమైనందుకు క్షమాపణలు చెబుతున్నాను. ఆ సన్నివేశం ద్వేషంతో, లేదా ఏదైనా నిర్దిష్ట సామాజిక వర్గాన్నో, మతాన్నో లక్ష్యంగా చేసుకుని చేసినది కాదు. ఈ సన్నివేశాన్ని సిరీస్ నుంచి మేం తొలగించాం. ప్రతి ఒక్కరూ తమ కెరీర్ ప్రారంభ దశలలో తప్పులు చేస్తారు. తాము కూడా అదే చేశాం.. అయితే దానిని వెంటనే సరిదిద్దాం. మళ్ళీ అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను. AIR వెబ్ సిరీస్ ఎంతో మంది యువ ప్రతిభావంతుల కెరీర్‌ల మీద ఆధారపడి ఉన్న అభిరుచితో రూపొందించబడింది. ఆ చిత్రంలోని డ్రామా, భావోద్వేగాలు, కొత్తదనం కోసమేనని గుర్తుంచుకోవాలి. కేవలం ఒక్క సన్నివేశంతోనే నెగిటివ్ దృష్టిలో పడేలా చేయకూడదు. భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ తయారుచేసేటప్పుడు మరింత బాధ్యతగా ఉంటానని ప్రేక్షకులకు హామీ ఇస్తున్నాను. ఈ అందమైన వారాంతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణలు కోరుతున్నాను. త్వరలోనే మరింత అందమైన కంటెంట్‌తో ఈ పొరపాటును సరిదిద్ది, మాపై ఉన్న కోపాన్ని తగ్గించుకుంటాం. ఈసారికి వదిలేయ్ అన్న.. నిన్ను నొప్పించాలని చేయలేదు’ అని టీమ్ AIR తరపున అందరినీ కౌగిలించుకుని చెప్పాలనుకుంటున్నానని సందీప్ రాజ్ లేఖ ముగించాడు. ఇప్పటికైనా అభిమానులు, ప్రేక్షకులు కాస్త కూల్ అవుతారేమో చూడాలి మరి.

సందీప్‌పై వచ్చిన ట్వీట్లు ఇలా..

సందీప్‌ ఇచ్చిన వివరణ.. క్షమాపణ ఇదీ..

Read Also- Postman: పోస్ట్ మ్యాన్‌లను అడ్డుకుంటున్న విల్లా గేటెడ్ కమ్యూనిటీలు

Just In

01

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి