Director Venky Atluri
ఎంటర్‌టైన్మెంట్

Venky Atluri: కళాకారులు కృష్ణా నగర్ నుంచి జూబ్లీహిల్స్ వరకు రావాలంటే ఉండాల్సింది ఇదే..

Venky Atluri: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్‌తో ఆ కుటుంబానికి చెందిన హీరోని పెట్టి హిట్టు కొట్టిన దర్శకుడు ఎవరయ్యా? అంటే వెంటనే అంతా ‘వెంకీ అట్లూరి’ పేరే చెబుతారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పవర్ స్టార్ టైటిల్ ‘తొలిప్రేమ’ (Tholiprema)తో మంచి హిట్టందుకున్నారు వెంకీ అట్లూరి. ఆ తర్వాత ఆయన వరసగా ప్రేమ కథలతో పాటు, తమిళ, మలయాళ హీరోలతో కూడా సినిమాలు చేసి హిట్స్ కొట్టారు. ధనుష్‌తో ‘సార్’, దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న వెంకీ అట్లూరి (Venky Atluri).. ఇప్పుడు మరో తమిళ హీరో సూర్యని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాతోనూ ఆయన భారీ హిట్టు కొడతాడని చిత్రయూనిట్ భావిస్తోంది. తాజాగా వెంకీ అట్లూరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

Also Read- The 100: ఆర్కే సాగర్ ‘ది 100’కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ సపోర్ట్!

– ‘తొలిప్రేమ’ అనే సినిమా అయితే తీశాను కానీ, నా లైఫ్‌లో ‘తొలిప్రేమ’ అంటూ ఎప్పుడూ ఆలోచించలేదు. ఇంకా చెప్పాలంటే.. నా తొలిప్రేమ కూడా సినిమానే.
– ఇప్పుడు వచ్చే రైటర్స్‌కి సజెషన్ అంటూ ఏమీ ఇవ్వను. కాకపోతే ఎప్పుడూ ఏదో ఒకటి రాస్తూనే ఉండాలి. ఎంత ఎక్కువ రాస్తే.. మైండ్‌కు అంత పదును పెరుగుతుంది. ఒక క్రికెటర్ నెట్ ప్రాక్టీస్ ఎలా అయితే చేస్తుంటాడో.. అలా రైటర్ కూడా తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి రాస్తూనే ఉండాలి. దర్శకుడిగా అయితే.. అందరినీ కలుపుకుని వెళ్లాలి. ఎవరైనా సలహా ఇచ్చినప్పడు కోపగించుకోకుండా.. అందులో మనకు ఉపయోగపడే మ్యాటర్ ఎంత ఉందనేది చూసుకోగలగాలి. సెట్‌కి వెళ్లేముందు వచ్చే సలహాలలో ఏది మంచిది, ఏది మంచిది కాదో తెలుసుకుంటే చాలు.

Also Read- Abhishek Bachchan: ఐష్‌తో విడాకులు.. అభిషేక్ బచ్చన్ ఏమన్నారంటే!

– కృష్ణా నగర్ నుంచి జూబ్లీహిల్స్ వరకు రావాలంటే కచ్చితంగా ప్రతిభ ఉండాలి. అలాగే యాటిట్యూడ్ మారాలి. నన్ను తొక్కేస్తున్నారు.. పైకి రానివ్వడం లేదనే ఇన్ సెక్యూరిటీ ఉన్నంతకాలం కృష్ణా నగర్ దాటి జూబ్లీహిల్స్ కొండ ఎక్కుతున్న ప్రతిసారి.. నాకు ఆ స్థాయి లేదని అనిపిస్తుంది. 50 ఏళ్ల తర్వాత కూడా మురళీ గౌడ్ (బలగం ఫేమ్) గవర్నమెంట్ జాబ్ వదులుకుని వచ్చి క్లిక్ అయ్యారు. ఇక్కడ ఎవరూ ఎవరినీ తొక్కరు.. అనేదానికి ఇదే ఉదాహరణ. ఎక్కడ నేను చేయలేనో అని అనుకోవడం, నాకెవ్వరూ రికమండేషన్ చేసే వారు లేరనుకోవడం వంటి ఇన్ సెక్యూరిటీ ఆడిషన్స్‌లో కూడా కనిపిస్తుంది. అలా ఉండే వారిని చూస్తే మాకు కూడా భయమేస్తుంది. ఇండస్ట్రీలో రికమండేషన్ ఉంటే అవకాశాలు తొందరగా వస్తాయనే దానిలో అస్సలు నిజం లేదు. వాటి వల్ల ఉద్యోగాలు వస్తాయి కానీ, సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావు. ఒక్క అపాయింట్‌మెంట్ వరకు రికమండేషన్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత వాళ్లు చక్కగా చేస్తేనే అవకాశం వస్తుంది. ఎవరికైనా టాలెంటే ముఖ్యం. అలాగే ఓపిక కూడా ఎక్కువ కావాలి. నేను దర్శకుడిగా నిలబడటానికి దాదాపు 12 సంవత్సరాలు పట్టింది. సహనం, పట్టుదల ఇక్కడ ముఖ్యం. నిరాశ ఎదురైనా, పట్టుదలతో ప్రయత్నిస్తే.. సక్సెస్ దానంతట అదే వస్తుంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

ఇంకా తన సినిమాలకు ఆర్టిస్ట్‌ల ఎంపిక, తనకు ఇష్టమైన సినిమా, మాస్టారు మాస్టారు పాట పుట్టుక, ధనుష్‌తో పనిచేయడం, సూర్యతో చేస్తున్న తదుపరి ప్రాజెక్ట్ విశేషాలు, ‘సార్, లక్కీ భాస్కర్’ సీక్వెల్స్, హైపర్ ఆది కామెడీ, ‘లక్కీ భాస్కర్’పై తన తండ్రి రియాక్షన్, ‘మిస్టర్ మజ్ను’ ఫెయిల్ అవడానికి కారణాలు, ఇండస్ట్రీలో తనకు ఇష్టమైన దర్శకులు, పాన్ ఇండియా సినిమాలపై అభిప్రాయం, ప్రస్తుత వివాహ వ్యవస్థపై తన అభిప్రాయం, ఒక్క రోజు సీఎం అయితే ఏం చేస్తారు?, ఇష్టమైన దైవం.. వంటి ఎన్నో విషయాలను ఆయన ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అవన్నీ తెలియాలంటే కింది వీడియో చూడాల్సిందే.

Just In

01

Nude Gang: నగ్నంగా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు