Varun Tej VT15
ఎంటర్‌టైన్మెంట్

Varun Tej VT15: వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ సినిమా అప్డేట్ ఇదే..

Varun Tej VT15: సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej).. హిట్లతో మంచి పేరు తెచ్చుకున్న మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంతో ‘VT15’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హైదరాబాద్, అనంతపురం షెడ్యూల్స్ పూర్తి చేసుకుని ఫారిన్ షెడ్యూల్‌ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ హై ఎనర్జీ సీక్వెన్స్‌లని చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తవుతుందని టీమ్ తెలిపింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. త్వరలో టైటిల్, గ్లింప్స్ విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ‘VT15’ సినిమాను యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇండో కొరియన్ హారర్ కామెడీ నేపధ్యంలో కథ సాగుతుందని సమాచారం. ఇప్పటికే వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో అయినా మంచి హిట్ సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. మ్యూజిక్‌తో బాక్సులు బద్దలుకొట్టే ఎస్.ఎస్. ధమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. హరర్ కామెడీ అవడం, దానికి తోడు ధమన్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాకు మాములుగానే బజ్ క్రియేట్ అయింది.

Also Read- CM Pushkar Dhami: వరి నాట్లేసిన ముఖ్యమంత్రి.. సడన్‌గా ఇలా మారిపోయారేంటి?

మెగా కుటుంబం నుంచి హీరోగా సినిమా పరిశ్రమకు పరిచయమై ‘ఫిదా, ఎఫ్2’ సినిమాలతో మంచి గుర్తింపు, సక్సెస్ తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. 2023లో వచ్చిన ‘ఎఫ్3’ తర్వాత హిట్లకు దూరమయ్యాడు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్‌ రాజా, మాస్ట్రో’ వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు మేర్లపాక గాంధీ. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పుడు ‘VT15’ రాబోతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు మేర్లపాక గాంధీ, UV క్రియేషన్స్‌తో కలిసి వరుణ్ తేజ్ చేస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమా మంచి హరర్ మూవీ చూసిన ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని మూవీ టీమ్ ప్రారంభం నుంచి చెబుతోంది. ప్రస్తుతం ప్రధాన తారాగణం అంతా ఫారిన్ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఈ ఫారిన్ షెడ్యూల్‌లో స్టన్నింగ్ విజువల్స్‌ షూట్ జరుగుతోంది. ఈ విజువల్స్ సినిమాకు ఇంటర్నేషనల్ టచ్‌ని అందిస్తాయని టీమ్ చెబుతోంది.

Also Read-Radha Manohar Das: లైవ్‌లో రచ్చ రచ్చ చేసిన రాధా మనోహర్.. నవ్వులే నవ్వులు!

కథల ఎంపికలో వరుణ్ తేజ్ విభిన్నంగా ఆలోచిస్తారు. వివిధ జోనర్స్‌ సినిమాలలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అవన్నీ కమర్షియల్‌గా హిట్ కాకపోయినా నటన పరంగా వరుణ్ తేజ్‌ను మరో మెట్టు ఎక్కించాయి. కంచె, కొండ పొలం, గద్దలకొండ గణేష్, లోఫర్ వంటి వివిధ జోనర్స్ వరుణ్ తేజ్ ఒక కేటగిరీకే పరిమితం కాదని చెబుతున్నాయి. అయితే ఇప్పడు రాబోతున్న సినిమాపై మాత్రం భారీ అంచనాలే ఉన్నాయని చెప్పవచ్చు. వరుస ఫ్లాప్‌లతో నెట్టుకొస్తున్న వరుణ్ తేజ్ ఈ సారి హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?