Ramachandra Rao (imagecredit:twitter)
Politics

Ramachandra Rao: త్వరలో కమలం బహిరంగ సభ.. బీజేపీ స్టేట్ చీఫ్ కసరత్తు

Ramachandra Rao: ఇన్ని రోజులు నూతన అధ్యక్షుడు ఎవరా అనే సందిగ్ధంలో ఉన్న కమలం నేతలకు జాతీయ నాయకత్వం ఎట్టకేలకు చెక్ పెట్టింది. కాషాయ దళపతిగా రాంచందర్ రావు(Ramchendar Rao) ఎన్నిక బాధ్యతల స్వీకరణ చకచకా జరిగిపోయింది. కాగా ఇన్ని రోజులు స్తబ్ధుగా ఉన్న పార్టీలో జోష్ నింపడంపై రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాలని భావిస్తోంది. ఎందుకంటే త్వరలో తెలంగాణ(Telangana)లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈనేపథ్యంలో శ్రేణుల్లో ఉత్సాహం నింపడంపై రాంచందర్ రావు దృష్టిసారిస్తున్నట్లు సమాచారం. బాధ్యతలు తీసుకున్న తొలిరోజే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి ఆయన పిలుపునిచ్చారు. కాగా భవిష్యత్ లో సైతం దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆయన నిర్వహించబోయే తొలి సభ
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(jubilee hills Gopinath) మృతితో ఆ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అలాగే త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు(Local Body Elections) ఉండటంతో ఈ ఎన్నికలకు కలిసొచ్చేలా భారీ స్థాయిలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించాలని బీజేపీ(BJP) రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తున్నట్లు వినికిడి. రాంచందర్ రావు పార్టీకి నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికయ్యారు. బాధ్యతలు సైతం తీసుకున్నారు. అయితే ఆయన నిర్వహించబోయే తొలి సభతోనే కార్యకర్తలు, నాయకుల్లో ఫుల్ జోష్ నింపేలా ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ పెద్దలతో భారీ స్థాయిలో పబ్లిక్ మీటింగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీలు కుదిరితే ఏకంగా ప్రధానినే రంగంలోకి దించే ఆలోచన ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. లేదంటే ఎవరు అందుబాటులో ఉంటే వారిని రంగంలోకి దింపే యోచనలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Banakacherla Project: చంద్రబాబు మాటలకు పొంతన లేదు.. ఎమ్మెల్యే సంజయ్

తల మధ్య ఆధిపత్య పోరు
ప్రధానంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) తర్వాత నూతన అధ్యక్షుడెవరనే అంశంపై స్పష్టత లేకపోవడంతో కేడర్ అంతా సైలెంట్ గా ఉంది. కార్యక్రమాలు నిర్వహించినా తూతూ మంత్రంగా నిర్వహించిన సందర్భాలున్నాయి. అలాంటి తరుణంలో మరో నేతను కలిసే ధైర్యం కూడా నాయకులు, కార్యకర్తలు చేయలేదు. ఎందుకంటే పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఒక నేతను కాదని మరొకరిని కలిస్తే వారికి దూరమవుతామేమో అనే ఉద్దేశ్యంతో పెద్దగా ఎవరూ ఆసక్తి చూపలేదు. ఇప్పుడు స్టేట్ చీఫ్ గా రాంచందర్ రావు(Ramchendar Rao)కు బాధ్యతలను జాతీయ నాయకత్వం అప్పగించింది. ఇకనైనా శ్రేణులు యాక్టివిటీస్ లో ముందుకు కదులుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. నేతల మధ్య ఆధిపత్య పోరు, శ్రేణుల సమన్వయం, ఇతర సమస్యలను అధిగమించి జోష్ నింపడంపై ఎంతమేరకు సక్సెస్ అవుతారనేది చూడాలి.

Also Read: Medchal Crime: మేడ్చల్‌లో గోరం.. మహిళ దారుణ హత్య

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?