Banakacherla Project: చంద్రబాబు నాయుడు మాటలకు, చేతలకు సంబంధం ఉండదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో విచిత్ర పరిస్థితి నెలకొన్నదని, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఏకమై బీఆర్ఎస్ పార్టీపై దాడి చేస్తున్నాయని అన్నారు.
Also Read: Movie Piracy: పైరసీతో టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న కిరణ్ అరెస్ట్.. ఒక్క ఏడాదిలో రూ. 3700 కోట్ల నష్టం
తెలంగాణ పట్ల చంద్రబాబు మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబు నాయుడుకు లబ్ధి జరిగే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చామల కిరణ్ కుమార్ రెడ్డికి బనకచర్లపై అవగాహన లేదని, చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో తెలంగాణ సమస్యలపై పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. చంద్రబాబుపై రేవంత్ రెడ్డికి గురుభక్తి ఎక్కువైందని ఆరోపించారు.
Also Read: Cow Rain: ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఆవులు పడితే.. అసలు జరిగే పనేనా? వీడియో వైరల్